Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐష్‌కు ఒళ్లు మండింది... ఫోటోగ్రాఫర్లకు క్లాస్ పీకింది

బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్‌కు ఒళ్లు మండింది. మీడియా ఫోటోగ్రాఫర్లకు క్లాస్ పీకింది. అదీ కూడా కంటతడిపెడుతూ వారిపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇది సినిమా ఆడియో ఫంక్షన్ కాదనీ, తమ ప్రైవసీని కాస్తైనా గౌరవించండంటూ

Webdunia
మంగళవారం, 21 నవంబరు 2017 (13:04 IST)
బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్‌కు ఒళ్లు మండింది. మీడియా ఫోటోగ్రాఫర్లకు క్లాస్ పీకింది. అదీ కూడా కంటతడిపెడుతూ వారిపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇది సినిమా ఆడియో ఫంక్షన్ కాదనీ, తమ ప్రైవసీని కాస్తైనా గౌరవించండంటూ ప్రాధేయపడింది.
 
ఇటీవల ముంబైలో తన తండ్రి జయంతి వేడుకలను ఆమె తన తల్లి బృందతో కలిసి జరుపుకుంది. ఇందులోభాగంగా, శుశృష హాస్పిటల్‌కు ఐష్, ఆమె తల్లి, కుమార్తె ఆరాధ్యలను తీసుకెళ్లింది. స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రైవేట్ కార్యక్రమంలో అక్కడున్న చిన్నారుల మధ్య తండ్రి జయంతి వేడుకలు జరుపుకునేందుకు ఏర్పాట్లు చేశారు.
 
అయితే, కార్యక్రమ నిర్వాహకుల కంటే అక్కడ పదుల సంఖ్యలో ఫోటోగ్రాఫర్లు కెమెరాలతో నిండిపోయారు. పైగా, ఐష్ అక్కడకు రాగానే ఫొటోలు క్లిక్‌మనిపించడంతో ఆమెకు ఒళ్లు మండింది. ఒక్కసారిగా భావోద్వేగానికి గురైన ఐశ్వర్య.. ఫొటోగ్రాఫర్లకు క్లాస్ పీకింది. తన ప్రైవసీని గౌరవించాలని తడినిండిన కళ్లతో ఐశ్వర్య వేడుకుంది.
 
'ప్లీజ్ ఆపుతారా. మీకు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఇదేమీ ప్రిమియర్ షో కాదు. మరేదో పబ్లిక్ ఈవెంట్ కాదు. కాస్తయినా గౌరవం ఇవ్వడం నేర్చుకోండి' అంటూ ఐష్ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆ తర్వాత అక్కడున్న చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి తన తండ్రి జయంతి వేడుకలను ఘనంగా జరుపుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నాటక మాజీ డీజీపీ అనుమానాస్పద మృతి - ఇంట్లో విగతజీవుడుగా...

పుష్ప మూవీలోని 'సూసేకీ' పాట హిందీ వెర్షన్‌‍కు కేజ్రీవాల్ దంపతుల నృత్యం (Video)

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి - చెవి కమ్మలు నొక్కేసిన ఆస్పత్రి వార్డు బాయ్ (Video)

తిరుమల ఘాట్ రోడ్డులో దగ్దమైన కారు.. ప్రయాణికులు తప్పిన ప్రాణగండం!! (Video)

కాబోయే భర్త ఎలా ఉండాలంటే.. ఓ యువతి కోరికల చిట్టా .. సోషల్ మీడియాలో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments