Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

44వ ఏట అడుగుపెట్టిన ఐశ్వర్యారాయ్: అమీర్, కమల్, ప్రభాస్ ఏమంటున్నారో తెలుసా?

అందాల రాశి ఐశ్వర్యారాయ్ 44ఏట అడుగుపెట్టింది. తన కెరీర్‌లో పెళ్లికి ముందే కాకుండా పెళ్లికి తర్వాత కూడా హీరోయిన్‌గా ప్రేక్షకుల మదిని కొల్లగొట్టిన ఐశ్వర్యా రాయ్ నవంబర్ 1న పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటోం

Advertiesment
44వ ఏట అడుగుపెట్టిన ఐశ్వర్యారాయ్: అమీర్, కమల్, ప్రభాస్ ఏమంటున్నారో తెలుసా?
, బుధవారం, 1 నవంబరు 2017 (11:30 IST)
అందాల రాశి ఐశ్వర్యారాయ్ 44ఏట అడుగుపెట్టింది. తన కెరీర్‌లో పెళ్లికి ముందే కాకుండా పెళ్లికి తర్వాత కూడా హీరోయిన్‌గా ప్రేక్షకుల మదిని కొల్లగొట్టిన ఐశ్వర్యా రాయ్ నవంబర్ 1న పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటోంది. బాలీవుడ్ నటీమణిగా ముద్రవేసుకున్న ఈ భామ దక్షిణాది సినిమాల్లో అదరగొట్టింది. నాలుగు పదుల వయస్సైనా హీరోయిన్‌గా అందాలను ఆరబోస్తూ సినిమాలు చేసేస్తుంది.
 
1994లో విశ్వ సుందరిగా నిలిచిన ఐశ్వర్యారాయ్... ఆపై ఫ్యాషన్, మోడలింగ్ చేస్తూ సినీతార ఎదిగింది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కుమారుడు అభిషేక్ బచ్చన్‌ను పెళ్ళాడిన ఈ మాజీ విశ్వ సుందరికి ఆరాధ్య అనే అమ్మాయి వున్న సంగతి తెలిసిందే. 
 
తన కెరీర్‌లో తాళ్, ఇద్దరు, జీన్స్ వంటి సినిమాలతో మంచి పేరు సంపాదించిన ఐష్.. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో హమ్ దిల్ దె చుకె సనమ్ చిత్రానికి ఫిల్మ్ ఫేర్ బెస్ట్ అవార్డును గెలుచుకుంది. ఆపై మేళ, ధూమ్-2, దేవదాస్, జోష్, గుజారిష్, జోధా అక్బర్ వంటి వంటి సినిమాలు మంచి గుర్తింపును సంపాదించిపెట్టాయి. దేశ, అంతర్జాతీయ నటులతో నటించిన ఐశ్వర్యతో అమీర్ ఖాన్, కమల్ హాసన్, బాహుబలి హీరో ప్రభాస్ కలిసి నటించాలని ఉబలాటపడుతున్నారు. 
 
ఇప్పటికే  రెండో ఇన్నింగ్స్‌లో సినీ ఛాన్సులతో బిజీగా వున్న ఐశ్వర్యారాయ్‌తో గతంలో సినిమా చేసే అవకాశాలను కోల్పోయామని.. ఇక అలాంటి ఛాన్స్ వస్తే మాత్రం వదిలిపెట్టబోమని కమల్, అమీర్ అంటున్నారు. ఇక బాహుబలితో అంతర్జాతీయ స్టార్‌గా ఎదిగిపోయిన ప్రభాస్ కూడా అందాల రాశి ఐశ్వర్యారాయ్‌తో కలిసి నటించే అవకాశం వస్తే వదులుకునే ప్రసక్తే లేదని అంటున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమలా పాల్‌కు కొత్త చిక్కు... బెన్స్ కారు కొని.. పన్ను చెల్లించకుండా?