Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ తర్వాత రామ్ చరణ్... ఏక్ మినీ కథపై ప్రశంసల జల్లు.. (ట్రైలర్)

Webdunia
సోమవారం, 24 మే 2021 (14:54 IST)
Ek Mini Katha
రెబల్ స్టార్ ప్రభాస్ తరువాత, ప్రస్తుతం రామ్ చరణ్ అమేజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలయ్యే ఏక్ మినీ కథపై ప్రశంసల వర్షం కురిపించాడు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానున్న ఏక్ మినీ కథలోని సామాజిక సందేశం భేష్ అని.. ఇందులో తేలికపాటి, శృంగార కథ కూడా వుంది. ఈ సినిమా కోసం సినీ ఇండస్ట్రీతో పాటు, సినీ ప్రముఖుల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. వారిలో మెగా హీరో రామ్ చరణ్ కూడా వున్నారు. 
 
ఇంతకుముందు ప్రభాస్ కూడా ఈ సినిమాకు శుభాకాంక్షలు తెలిపాడు. ఈ చిత్రం పట్ల తన ఉత్సాహాన్ని వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ సినిమా మెగా సూపర్ స్టార్ రామ్ చరణ్ ప్రశంసలు అందుకుంది. అంతేగాకుండా ఈ సినిమా ట్రైలర్‌ను కూడా షేర్ చేశాడు. అంతేగాకుండా సినీ యూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశాడు. ఇక 
మే 27 నుండి అమెజాన్ ప్రైమ్‌లో #EkMiniKatha చూడండి.. అంటూ ట్వీట్ చేసారు.
 
ఇకపోతే.. దివంగత ప్రముఖ దర్శకుడు, వర్షం ఫేం శోభన్ కుమారుడు, యువ హీరో సంతోష్ శోభన్, కావ్య థాపర్ జంటగా నటిస్తున్న ఈ ఏక్ మినీ కథ చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. యూవీ కాన్సెప్ట్స్‌ బ్యానర్‌పై కార్తీక్ రాపోలు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మే 27వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఇటీవల విడుదలై మంచి స్పందనను రాబట్టుకుంటోంది. 
 
డబుల్ మీనింగ్ డైలాగ్స్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ కథను అందించడం గమనార్హం. నటీనటులు: సంతోష్ శోభన్, కావ్య థాపర్, బ్రహ్మాజీ, హర్షవర్ధన్‌, సుదర్శన్‌, పోసాని, శ్రద్ధాదాస్‌, సప్తగిరి తదితరులు నటించిన ఈ చిత్రానికి కార్తీక్ రాపోలు దర్శకత్వం వహిస్తున్నారు. 
 
ఇక కథ: మేర్లపాటి గాంధీ 
సంగీతం: ప్రవీణ్‌ లక్కరాజు 
సినిమాటోగ్రాఫర్: గోకుల్‌ భారతి
బ్యానర్స్: యూవీ కాన్సెప్ట్స్, మ్యాంగో మాస్ మీడియా 
ఓటీటీ రిలీజ్: అమెజాన్ ప్రైమ్ వీడియో 
రిలీజ్ డేట్: 2021-05-27 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments