Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

ఠాగూర్
గురువారం, 24 ఏప్రియల్ 2025 (11:47 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గామాలో జరిగిన ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌కు నటీనటులకు మద్దతు ఇచ్చే, వారి చిత్రాల్లో నటించే భారత నటీనటులకు నెటిజన్లు బహిరంగంగానే హెచ్చరికలు చేస్తున్నారు. దీంతో పాక్ నటులు ఉన్న చిత్రాలను ప్రమోట్ చేసేందుకు వణికిపోతున్నారు. తాజాగా బాలీవుడ్ నటి వాణి కపూర్‌ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు. పాకిస్థాన్‌కు చెందిన హీరో ఫవాద్ ఖాన్ నటించిన చిత్రాన్ని ఆమె తన ఎక్స్ ఖాతాలో ప్రమోట్ చేశారు. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో ఆమె ఆ మూవీ పోస్టర్‌ను డిలీట్ చేశారు. 
 
ఫవాద్, వాణి కపూర్ జంటగా 'అబీర్ గులాల్' అనే పేరుతో ఓ చిత్రం తెరకెక్కింది. మే నెల 9వ తేదీన విడుదలకానుంది. దీంతో చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇందులోభాగంగా, వాణి కపూర్ తన ఎక్స్ ఖాతాలో ఆ చిత్రం పోస్టర్‌ను షేర్ చేశారు. దీన్ని చూసిన నెటిజన్లు ఆమెపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కూడా పాక్ నటుల చిత్రాలను ప్రమోట్ చేస్తారంటూ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. 
 
దీంతో చేసేదేమిలేక ఆమె ఆ పోస్టును డిలీట్ చేశారు. అలాగే, ఈ దాడిపై స్పందిస్తూ మృతుల కుంటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలిపారు. హీరో ఫవాద్ ఖాన్ కూడా ఈ పాశవిక దాడిని ఖండిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. మరోవైపు, ఈ మూవీని బాయ్‌కాట్ చేయాలంటూ ఎక్స్ వేదికగా హ్యాష్‌టాగ్ ఒకటి ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రాన్ని ప్రకటించిన మొదటి నుంచే వ్యతిరేకత ఉండగా, తాజాగా జరిగిన ఉగ్రదాడితో ఆ వ్యతిరేక మరింతగా పెరిగింది. ఈ మూవీని ప్రోత్సహిస్తున్న బాలీవుడ్ చిత్రసీమపై కూడా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో హై అలెర్ట్

Bin Laden: ఒసామా బిన్ లాడెన్‌కు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌కు పెద్ద తేడా లేదు.. మైఖేల్ రూబిన్

పొరుగు రాష్ట్రాలకు అమరావతి కేంద్రంగా మారనుంది.. ఎలాగంటే?

ఫహల్గామ్ ఘటన.. తిరుమలలో అలెర్ట్- టీటీడీ యంత్రాంగం అప్రమత్తం (video)

చీటింగ్ కేసులో లేడీ అఘోరీ అరెస్టు.. లింగ నిర్ధారణకు పోలీసుల నిర్ణయం!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments