Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాడుతా తీయగా జడ్జీలు పక్షపాతం చూపుతున్నారు.. ప్రవస్తి (Video)

Advertiesment
pravasthi

ఠాగూర్

, సోమవారం, 21 ఏప్రియల్ 2025 (15:49 IST)
ప్రముఖ తెలుగు టీవీ చానెల్‌లో ప్రసారమవుతున్న పాడుతా తీయగా కార్యక్రమానికి జడ్జీలుగా హాజరయ్యే ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి, గీత రచయిత చంద్రబోస్, సింగర్ సునీతలపై గాయని ప్రవస్తి ఆరాధ్య సంచలన ఆరోపణలు చేశారు. ఈ ముగ్గురు న్యాయనిర్ణేతలు పక్షపాతం చూపుతున్నారని ఆమె ఆరోపించారు. 
 
కీరవాణి కంపోజ్ చేసిన పాటలు పాడితేనే ఎక్కువ మార్కులు ఇస్తున్నారని చెప్పారు. పెళ్లిళ్ళలో పాటలు పాడినందుకు తనను ఘోరంగా అవమానించారని వాపోయారు. సెట్‌లో కూడా తనను బాడీ షేమింగ్ చేశారని, తనను షూటింగులో ఓ చీడపురుగులా చూసారని, తమిళంలోనూ ఎన్నో పాటలు పాడానని, ఎపుడు కూడా ఇలాంటి పరిస్థితి ఎదుర్కోలేదని ప్రవస్తి ఆరాధ్య చెప్పుకొచ్చారు. 
 
న్యాయ నిర్ణేత ప్రవర్తన తనను తీవ్రంగా బాధించిందని ఆమె అన్నారు. షూటింగ్ సమయంలో తనను ఒక చీడపురుగును చూసినట్టు చూశారని, ఎంతో చులకన భావంతో వ్యవహరించారంటూ బోరున విలపించారు. తెలుగులో ఇలాంటి ప్రతిష్టాత్మక వేదికపై ఈ రకమైన అనుభవం ఎదురుకావడం దురదృష్టకరమని ఆమె ప్రవస్తి వాపోయారు. 
 
పాడుతా తీయగా కార్యక్రమంలో తనకు తీవ్ర అన్యాయం జరిగిందని, పక్షపాతం, అవమానాలకు గురయ్యానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కీరవాణి స్వరపరిచిన పాటలు పాడితే అధిక మార్కులు వేస్తూ, ఇతర పోటీదారులను తక్కువ చేసినట్టు మాట్లాడుతున్నారని ప్రవస్తి ఆరాధ్య పేర్కొన్నారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్