Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రెండో పెళ్లి చేసుకున్న నటి... ప్రియుడుతో కలిసి మూడుముళ్ల బంధంలోకి...

Advertiesment
pawani amir marriage

ఠాగూర్

, సోమవారం, 21 ఏప్రియల్ 2025 (08:27 IST)
బుల్లితెర సీరియల్స్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి పావని రెడ్డి. అమృతంలో చందమామ, సేనాపతి, మళ్లీ మొదలైంది, చారీ 111 వంటి చిత్రాలతో వెండితెరపై సందడి కూడా చేసింది. ఈ బ్యూటీ తాజాగా తన ప్రియుడుతో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. బిగ్ బాస్-5 సీజన్‌లో పాల్గొన్న పావని, అదేషోలోని కంటెస్టెంట్ కొరియోగ్రాఫర్ అమీర్‌ను పెళ్లిచేసుకుంది. పావని రెడ్డికి ఇది రెండో వివాహం కాగా, అమీర్‌కు మొదటి వివాహం. చెన్నై నగరంలోని ఓ రిసార్టులో జరిగిన ఈ వివాహ వేడుకకు రెండు కుటుంబాల సభ్యులు, బంధువులు, స్నేహితులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అమీర్ ముస్లిం అయినప్పటికీ అమ్మాయి ఇష్టప్రకారం హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు. 
 
కాగా, పావనికి 2017లో ప్రదీప్ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. కానీ పెళ్లైన కొన్నాళ్ళకే అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక పావని రెడ్డి 2012 నుంచి సినిమాల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళ సీరియళ్ల ద్వారా కూడా బుల్లితెర ప్రేక్షకులకు ఆమె ఆలరించారు. సీరియల్స్‌లో పావన నటన చూసి ఇంప్రెస్ అయిన అమీర్ క్రమగా ఆమె అభిమానిగా మారిపోయారు. 
 
ఇవికాకుండా విజయ్‌ టీవీలో డ్యాన్స్ మాస్టర్‌గా పనిచేస్తున్న అమీర్‌కు బిగ్ బాస్ సీజన్-5షోలో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వెళ్లే అవకాశం లభించింది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని లోపలికి వెళ్లిన అమీర్... అక్కడ పావనికి తన ప్రేమను వ్యక్తం చేశాడు. దాదాపు మూడేళ్లపాటు ప్రేమలో మునిగితేలిన వీరిద్దరూ ఇపుడు పెద్దల సమక్షంలో హిందూ సంప్రదాయంలో వివాహబంధంతో ఒక్కటయ్యారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి