Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్బాయిగా మారిన అదాశర్మ.. ఔనా?

Webdunia
శుక్రవారం, 24 మే 2019 (19:47 IST)
"హార్ట్ ఎటాక్" చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమైన భామ అదా శర్మ. ఆమె 'సన్నాఫ్ సత్యమూర్తి', 'సుబ్రమణ్యం ఫర్ సేల్', 'క్షణం' వంటి సినిమాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అదాశర్మ టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో కొన్ని చిత్రాల్లో నటించింది. "1920, ఫిర్, హసీ తో ఫసీ, కమాండో 2" వంటి చిత్రాలలో నటించింది.
 
ప్రస్తుతం ఈమె బాలీవుడ్‌లో 'మ్యాన్ టు మ్యాన్' అనే సినిమా చేస్తుంది. ఈ మూవీలో ఆమె లింగమార్పిడి చేయించుకున్న పురుషుడి పాత్రలో కనిపించనుంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ మీసాలు పెట్టుకుని దిగిన ఫోటోను అదా శర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. మ్యాన్ టు మ్యాన్‌లో నవీన్ కస్తూరియా హీరోగా నటిస్తున్నాడు. 
 
నవీన్, అదా అందం చూసి ఇష్టపడి ఆమెని పెళ్ళి చేసుకుంటాడు. చివరకు ఆమె లింగమార్పిడి చేయించుకున్న పురుషుడని తెలుస్తుంది. ఆ తర్వాత ఏమి జరిగింది అనే అంశంతో మ్యాన్ టు మ్యాన్ చిత్రం తెరకెక్కుతోంది. ఇది ఛాలెంజింగ్ క్యారెక్టర్ కావడంతో ఒప్పుకున్నానని, ఈ విధమైన పాత్రలు వస్తే ఏ భాషలోనైనా నటించడానికి సిద్ధంగా ఉన్నట్సు అదా శర్మ చెప్పుకొచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ట్రాఫిక్ రద్దీ : పారాగ్లైడింగ్ ద్వారా పరీక్షా కేంద్రానికి చేరుకున్న విద్యార్థి (Video)

గర్భం చేసింది ఎవరో తెలియదు.. పురిటి నొప్పులు భరించలేక 16 ఏళ్ల బాలిక మృతి

దూసుకొస్తున్న తుఫాను - పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!

మైసూరులో విషాదం.. తల్లి, భార్య, కుమారుడికి విషమిచ్చి చంపేసి.. తానూ...

తాగి బండిని నడిపాడు.. కారు డ్రైవింగ్ చేస్తూ 8 బైకులను ఢీకొట్టాడు... (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం