కాంచన-3 సినిమా హిట్టయ్యిందన్న ఆనందం కాంచనతోనే ఆవిరైపోయింది. బాలీవుడ్‌లో అడుగుపెట్టాలన్న నిర్ణయంపై నిర్మాతలు నీళ్ళు చల్లారు. ఆత్మాభిమానం అడ్డుతగలడంతో హిందీ సినిమా నుంచి బయటకు వచ్చేశాడు లారెన్స్. లారెన్స్ సెల్ఫ్ రెస్పెట్‌ను ఎవరు డామేజ్ చేశారు.
కాంచన సిరీస్ లారెన్స్‌కు ఒక మంచి పేరునే తెచ్చిపెట్టింది. వరుసగా వచ్చిన మూడు సినిమాలు మంచి విజయాన్ని అందుకుంది. ఈ సక్సెస్ రేటే హిందీ ఆఫర్‌ను తీసుకొచ్చింది. కాంచన్ సినిమాతో దర్సకుడిగా హిందీలోకి ఎంట్రీ ఇచ్చాడు లారెన్స్. లారెన్స్ నటించిన పాత్రను హిందీ రీమేక్‌లో అక్షయ్ కుమార్ నటిస్తున్నారు.
కైరా అద్వానీ హీరోయిన్. ఈ మధ్యనే సినిమా ప్రారంభమైందో లేదో ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసేశారు. లారెన్స్‌ను సంప్రదించకుండా నిర్మాతలు రిలీజ్ చేసేశారు. దీంతో దర్శకుడు హర్టయ్యి సినిమా నుంచి తప్పుకున్నారు. అజయ్ దేవగన్ నటిస్తున్న లక్ష్మీ బాంబ్ సినిమా నుంచి పూర్తిగా బయటకు వచ్చేశాడు లారెన్స్.
డబ్బు, పేరు కంటే ఆత్మాభిమానం ఎంతో ముఖ్యం. నాకు ఆత్మాభిమానం ఉంది కాబట్టే లక్ష్మిబాంబ్ సినిమా నుంచి తప్పుకున్నాను. నాతో చర్చింకుండా నా ప్రమేయం లేకుండా పోస్టర్ రిలీజ్ చేశారు. ఇలాంటి పరిస్థితి ఏ దర్శకుడికి రాకూడదంటున్నారు లారెన్స్. దర్శకుడిగా తప్పుకున్నంత మాత్రాన నా స్క్రిప్ట్‌ను ఇచ్చేయమని అడుగను. అలాగని దర్శకుడిగా కొనసాగలేను. అక్షయ్ అంటే నాకు ఎంతో అభిమానం. త్వరలో ఆయన్ను కలిసి విషయం చెబుతాను. చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ అంటూ పేర్కొన్నాడు లారెన్స్. మరి దీనిపై అక్షయ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.