Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెళ్లి కాకుండానే తండ్రి కాబోతున్న సల్మాన్ ఖాన్

Advertiesment
పెళ్లి కాకుండానే తండ్రి కాబోతున్న సల్మాన్ ఖాన్
, శుక్రవారం, 10 మే 2019 (08:43 IST)
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. పెళ్లికాకుండానే తండ్రికాబోతున్నాడు. నిజానికి బాలీవుడ్‌లో ఉన్న హీరోల్లో సల్మాన్ అత్యంత ముదురు బ్యాచిలర్. ఈయనకు హీరోయిన్ కత్రినా కైఫ్‌తో ప్రేమ పెటాకులైంది. దీంతో ఆయన పెళ్లి మాటే ప్రస్తావించడం లేదు. ఈ నేపథ్యంలో ఆయన తండ్రికాబోతున్నాడు. 
 
ఈ హీరో.. పెళ్లి చేసుకోకుండానే ఓ బిడ్డకు తండ్రి కావాలని నిర్ణయం తీసుకున్నాడట. అందుకో సరోగసీ విధానం ద్వారా ఓ బిడ్డకు జన్మనివ్వాలని ఆయన భావిస్తున్నారు. అంతా అనుకున్నట్టు జరిగితే మరో యేడాదిలో సల్మాన్ ఖాన్ భార్య లేకుండానే ఓ బిడ్డకు తండ్రికాబోతున్నాడు. 
 
కాగా, బాలీవుడ్‌లో ఇప్పటివరకు షారూక్ ఖాన్, కరణ్ జోహార్, ఏక్తా కపూర్ వంటి ప్రముఖులు సరోగసీ విధానం ద్వారానే విజయవంతంగా పిల్లల్ని కన్నారు. అలాగే, టాలీవుడ్‌లో మంచి లక్ష్మీ కూడా సరోగసీ ద్వారానే ఓ బిడ్డను కన్న సంగతి తెలిసిందే.. ఇప్పుడు సల్మాన్ ఖాన్ కూడా ఇదే పద్ధతిలో త్వరలో పండంటి బిడ్డను తమ ఖాన్ ఖాందాన్‌లోకి తీసుకురాబోతున్నట్టు బాలీవుడ్ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహర్షి చిత్రం చూడటానికి 5 కారణాలు... ఏంటవి?