Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రూ.8,990కే నోకియా 3.2 స్మార్ట్‌ఫోన్

Advertiesment
Nokia 3.2 review
మొబైల్ తయారీదారు సంస్థ హెచ్ఎండీ గ్లోబల్ తన నూతన స్మార్ట్‌ఫోన్ నోకియా 3.2ను ఇవాళ భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్ రూ.8,990 ప్రారంభ ధరతో ఈ నెల 23వ తేదీ నుండి వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. కాగా ఈ స్మార్ట్‌ఫోన్ లాంచింగ్ సందర్భంగా పలు ఆఫర్లను కూడా అందిస్తున్నారు. 
 
ఈ ఫోన్‌ను కొన్న క‌స్ట‌మ‌ర్ల‌కు రూ.1వేయి విలువైన గిఫ్ట్ కార్డును అందిస్తారు. దానికి జూన్ 30వ తేదీ వ‌ర‌కు గ‌డువు ఉంటుంది. అలాగే 6 నెల‌ల కాల వ్య‌వ‌ధి గ‌ల వ‌న్ టైం స్క్రీన్ రీప్లేస్‌మెంట్ ప్లాన్‌ను ఉచితంగా అందివ్వ‌నున్నారు. దీంతోపాటు ఈ ఫోన్‌పై నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయాన్ని కూడా అందిస్తున్నారు.
 
నోకియా 3.2 ఫీచ‌ర్లు...
* 6.26 అంగుళాల హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే,
* 720 x 1520 పిక్స‌ెల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 
* స్నాప్‌డ్రాగ‌న్ 429 ప్రాసెస‌ర్‌, 2/3 జీబీ ర్యామ్, 
* 16/32 జీబీ స్టోరేజ్‌, 400 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, 
* డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, 
* 13 మెగాపిక్స‌ెల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్స‌ెల్ సెల్ఫీ కెమెరా, 
* ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, ఫేస్ అన్‌లాక్‌, 
* 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్టూడెంట్‌పై కన్నేసిన లేడీ లెక్చరర్.. కోరిక తీర్చమంటూ వెంటపడింది..