Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్టూడెంట్‌పై కన్నేసిన లేడీ లెక్చరర్.. కోరిక తీర్చమంటూ వెంటపడింది..

Advertiesment
స్టూడెంట్‌పై కన్నేసిన లేడీ లెక్చరర్.. కోరిక తీర్చమంటూ వెంటపడింది..
, మంగళవారం, 21 మే 2019 (16:10 IST)
లైంగిక వాంఛలను తీర్చుకోవడానికి చిన్నా పెద్దా, వావి వరుసలు, వయస్సు తాపతమ్యాలు వంటి వాటిని పట్టించుకోకుండా ఎవరైనా ఓకే అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఎంతకైనా బరితెగిస్తున్నారు.


విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు కూడా ప్రేమ పాఠాలు వల్లిస్తున్నారు. విద్యార్థి ఉన్నత చదవడానికి సహకరించాల్సిన ఉపాధ్యాయురాలు లైంగిక వాంఛ తీర్చమంటూ విద్యార్థి వెంట పడి వేధింపులకు గురిచేసింది.
 
న్యూయార్క్‌కి చెందిన లిండ్సే హాల్ స్టెడ్ అనే లెక్చరర్ స్థానికంగా ఉండే వాటర్‌లూ సెంట్రల్ డిస్ట్రిక్ట్ స్కూల్‌లో గత నాలుగు సంవత్సరాలుగా పని చేస్తున్నారు. ఆ క్రమంలో క్లాసులోని ఓ విద్యార్థిపై ఆ టీచర్ కన్నుపడింది. సదరు విద్యార్థిని ఏకాంతంగా కలవడం, ఫోన్‌లో మెసేజ్‌లు పంపడం, ఫోటోలు పంపడం చేస్తుండేది.
 
ఆ విద్యార్థి వద్దని వారించినప్పటికీ తన కోరిక తీర్చమంటూ వెంటపడింది. టీచర్ వ్యవహార శైలి నచ్చక ఆ విద్యార్థి ఆమెకు దూరంగా ఉండేవాడు. అతడు దూరమవుతున్నకొద్దీ ఆమె మరింత దగ్గరవ్వాలని చూసింది. అందుకోసం ఓ ప్రణాళికను రచించింది. స్కూల్ పనిమీద లైబ్రరీకి రమ్మని పిలిచింది. అక్కడ అతడిపై లైంగిక దాడికి పాల్పడింది. అనంతరం ఎవరికీ చెప్పవద్దంటూ లేడీ టీచర్ విద్యార్థికి వార్నింగ్ ఇచ్చింది. 
 
కానీ ఇదంతా స్కూల్ సీసీ కెమెరాలో రికార్డవడంతో సీసీటీవీ ఫుటేజీ చూసిన సిబ్బంది అవాక్కయ్యారు. వెంటనే లిండ్సేను విధుల నుండి తప్పించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు లిండ్సేను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొడుకు ప్రియురాలిని పెళ్లాడిన తండ్రి... ఎందుకో తెలిస్తే షాకవుతారు...