Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బుల్లితెర నటితో వివాహం చేస్తారా? లేదా? బీటెక్ విద్యార్థి హల్‌చల్

Advertiesment
బుల్లితెర నటితో వివాహం చేస్తారా? లేదా? బీటెక్ విద్యార్థి హల్‌చల్
, శుక్రవారం, 10 మే 2019 (13:22 IST)
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో ఓ బీటెక్ విద్యార్థి హల్‌చల్ చేశాడు. ఓ బుల్లితెర నటి ఇంట్లోకి చొరబడి.. ఆమెతో పెళ్లి చేయాలంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన శుక్రవారం జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రితికా అనే ప్రముఖ బుల్లితెర నటి ప్రైవేట్ ఛానల్‌లో ప్రసారం అవుతున్న "రాజారాణి" సీరియల్‌తో పాటు పలు సీరియల్స్‌లో నటిస్తోంది. ఆమె తన తండ్రితో కలిసి చెన్నై వడపళనిలోని ఓ బహుళ అంతస్తు భవనంలో నివసిస్తోంది. 
 
అయితే గురువారం ఉదయం ఓ యువకుడు అపార్టమెంట్‌లోని రితిక నివసించే ఇంటికి వచ్చాడు. కాలింగ్ బెల్ కొట్టగా రితిక తండ్రి సుబ్రహ్మణి వచ్చి తలుపు తెరిచాడు. ఆ వెంటనే ఆ బీటెక్ విద్యార్థిని ఇంట్లోకి చొరబడ్డాడు. అనంతరం ఆ యువకుడు నటి రితికాతో తనకు వివాహం జరిపించాలని రితిక తండ్రిని ఒత్తిడి చేశాడు. 
 
ఆ యువకుడి మాటాలతో షాక్ గురైన రితిక తండ్రి ఆ యువకుడితో గొడవ చేశాడు. దీంతో యువకుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని వడపళని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. 
 
బెదిరింపులకు పాల్పడిన యువకుడు గోబిచెట్టిపాళెయానికి చెందిన భరత్‌గా పోలీసులు గుర్తించారు. ఇంజినీరింగ్‌ విద్యార్థి అయిన భరత్‌ ఉద్యోగం కోసం చెన్నైకు వచ్చాడని పోలీసుల విచారణలో తేలింది. తాను రితికాను వివాహం చేసుకోవాలనుకుంటున్నట్లు పోలీసుల విచారణలో చెప్పినట్లు పోలీసులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Fake న్యూస్ స్క్రోల్ చేసినవారికి TV9 రవిప్రకాష్ చెంపదెబ్బ... లైవ్‌లో(Video)