Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Fake న్యూస్ స్క్రోల్ చేసినవారికి TV9 రవిప్రకాష్ చెంపదెబ్బ... లైవ్‌లో(Video)

Advertiesment
Fake న్యూస్ స్క్రోల్ చేసినవారికి TV9 రవిప్రకాష్ చెంపదెబ్బ... లైవ్‌లో(Video)
, శుక్రవారం, 10 మే 2019 (13:01 IST)
టీవీ9 సీఈఓ రవిప్రకాష్ ను పోలీసులు గాలిస్తున్నారనీ, ఆయన పారిపోయారంటూ కొన్ని ఛానళ్లు, సైట్లు స్క్రోలింగ్ చేయడంపై రవిప్రకాష్ మెత్తగా చురకలు అంటించారు. ఆయన నేరుగా టీవీ9 లైవ్ లో మాట్లాడారు. ఆయన మాటల్లోనే... '' నాకోసం పోలీసులు గాలిస్తున్నారని స్క్రోల్ చేసినందుకు ధన్యవాదాలు. రవి ప్రకాష్ గురించి వచ్చిన వార్తలు గురించి టీవీ9 వీక్షకులు ఆందోళన చెందారు. ఛానళ్లు కాస్త బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి.
 
నాపై NCLT  కేసు కోర్టు విచారణలో వున్న మాట వాస్తవమే. అది విచారణ జరుగుతోంది. సత్యం మాత్రమే నిలబడుతుంది. నన్ను మొన్న సాయంత్రం వీక్షకులు చూశారు. టీవీ9 సామాజిక బాధ్యతతో, సరైన విలువలతో సరైన వార్తలతో గత 10 ఏళ్లు నుంచి నెం. 1 స్థానంలో వున్నాము. మీరిచ్చిన తప్పుడు వార్తలకు మరోసారి ధన్యవాదాలు. నిజం చెప్పులు వేసుకునేలోపుగా అబద్ధం ప్రపంచం చుట్టి వస్తుంది. అదే నా విషయంలో జరిగింది. అమెరికా నుంచి ఎంతోమంది ఫోన్లు చేస్తున్నారు.
 
మీరు పాపులారిటీ కోసం ఫేక్ న్యూస్ సృష్టిస్తే మీ క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. అదే మీకే నష్టం. ఎవరో పారిపోయారనీ, ఎవరో ఆత్మహత్య చేసుకున్నారంటూ తోటి ఛానళ్లు ఓ ఛానల్ సీఈఓపై అసత్యపు వార్తలను ప్రచారం చేయడం దారుణం. ఇకనైనా బాధ్యతాయుతమైన వార్తలు రాస్తారని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సమయం కోరిన మధ్యవర్తులు.. అయోధ్య కేసు మళ్లీ వాయిదా!