Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ మద్యం షాపు వయసు 172 యేళ్లు.. లైసెన్స్ నం.1 :: ఫేక్ న్యూసంటున్న నెటిజన్లు

Advertiesment
ఆ మద్యం షాపు వయసు 172 యేళ్లు.. లైసెన్స్ నం.1 :: ఫేక్ న్యూసంటున్న నెటిజన్లు
, సోమవారం, 6 మే 2019 (16:14 IST)
ఒకటి కాదు.. రెండు కాదు.. 10 - 20 ఏళ్లు కూడా కాదు. పోనీ వందేళ్లు అంటే అదీ కాదు. ఆ మద్యం షాపు వయసు ఎంతో తెలుసా.. 172 యేళ్లు. ఇటీవలే 172 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ మద్యం షాపునకు చెందిన పోస్ట్ ఇపుడు వైరల్ అయింది.
 
భారత స్వాతంత్ర్యానికి పూర్వం అంటే 1847లో మహాష్ట్రలోని నాసిక్‌లో ఈ మద్యం షాపు ప్రారంభమైంది. ఇదే భారతీయ అతి పురాతన మద్యం షాపుగా గుర్తింపుపొందింది. ఈ వైన్ షాపు లైసెన్సు నంబరు ఒకటి. ఓ రెండతస్తుల భవనంలో ఆ లిక్కర్‌ షాపును ప్రారంభించారు. అయితే, అదే భవనంలో ఇప్పటివరకు ఆ లిక్కర్ షాపు కొనసాగుతుండడం విశేషం. ఇదే విదేశీ బ్రాండ్లతో పాటు.. స్థానికంగా లభ్యమయ్యే మేలురకం మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి. 
 
ఫొటోల ప్రకారం అప్పట్లో ఆ మద్యం షాపు ముందు వరండాలా ఉండేది, పై అంతస్తులో చిన్న చిన్న కిటికీలు ఉన్నాయి. కానీ, కాలక్రమంలో పైన కిటికీలు పెద్దవైపోయాయి.. కింది భాగంలో కొన్నా మార్పులతో ఇప్పటికీ ఆ లిక్కర్ షాపు కొనసాగుతోందంటూ పోస్ట్ పెట్టారు. అయితే, 172 ఏళ్ల నుంచి షాపును కొనసాగించడం అద్భుతమని కొందరు పేర్కొంటుంటే.. ఇది ఫేక్ న్యూస్ అని మరొకిందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ వార్త మాత్రం ఇపుడు వైరల్‌గా మారింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టిక్‌టాక్‌లో ఫేమస్ అయితే డబ్బులు సంపాదించొచ్చా?