Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మంగళగిరిలో లోకేష్ ఓడిపోతున్నాడంటూ కథనం.. మండిపడుతున్న తమ్ముళ్లు

Advertiesment
మంగళగిరిలో లోకేష్ ఓడిపోతున్నాడంటూ కథనం.. మండిపడుతున్న తమ్ముళ్లు
, సోమవారం, 6 మే 2019 (12:29 IST)
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఏపీలో విజయం ఎవరిని వరిస్తుంది? అనే  అంశం ఇప్పడు హాట్ టాపిక్‌గా మారింది. జగన్మోహన్ రెడ్డి ఆంద్రాకు కాబోయే ముఖ్యమంత్రి అని సౌండ్ బాగా వినపడుతున్న నేపథ్యంలో ఏపీలో చోటుచేసుకుంటున్న పరిణామలపై సంచలన కథనాలు రాస్తున్నాయి పలు పత్రికలు. 
 
తాజాగా నారా లోకేష్ పైన ఆసక్తికర కథానాన్ని ప్రచురించింది ఓ తమిళ పత్రిక. నారా లోకేష్ తొలిసారిగా మంగళగిరి నుంచి ఎన్నికల బరిలో నిలిచిన విషయం తెలిసిందే. దాదాపు మూడు దశాబ్దాలుగా మంగళగిరి నుంచి తెలుగుదేశానికి ప్రాతినిధ్యం లేదు. గతంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా పేరున్న ఈ నియోజకవర్గం ప్రస్తుతం వైసీపీ కోటాలో ఉంది. అయితే ఈ నేపథ్యంలో తమిళనాడుకు చెందిన ఓ పత్రిక ‘దిన మలర్’ మంగళగిరిలో నారా లోకేష్‌ ఓడిపోతున్నాడన్నది  ఆ కథనం సారాంశం. 
 
లోకేష్ మంత్రిగా ఉండి కూడా గెలుస్తానన్న ధైర్యం ఆయనలో లేదంటూ ప్రచురించింది. తమిళ పత్రికలో లోకేష్ గెలుపుపై ఇలాంటి కథనాలు ప్రచురించడంతో మండిపడుతున్నారు తెలుగు తమ్ముళ్లు. మంగళగిరి లోకేష్ గెలుపును ఎవరూ ఆపలేరని అంటున్నాయి పార్టీ వర్గాలు. మరి ఏం జరుగుతుందో మే 23 వరకూ వేచి చూడాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వెస్ట్ బెంగాల్ హింసాత్మకం : బీజేపీ అభ్యర్థిని చితకబాదిన టీఎంసీ కేడర్