గయలో బాలికను రేప్ చేసిన సహచర బాలుడు

బుధవారం, 15 మే 2019 (12:34 IST)
బీహార్ రాష్ట్రంలో దారుణం జరిగింది. 12వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై సాటి విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గయ జిల్లాలో మంగళవారం జరిగింది. ఇది స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, 12వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని మంగళవారం సాయంత్రం వేళ ట్యూషన్‌కు వెళ్లి ఒంటరిగా వస్తున్నది. ఆ విద్యార్థినిపై ఎప్పటి నుంచో కన్నేసిన సాటి విద్యార్థి... బాధిత బాలిక ట్యూషన్‌కు వెళ్లి వస్తుండగా కాపుకాసి బలవంతంగా నిర్జన ప్రదేశానికి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
అత్యాచారం తర్వాత ఆ బాలికను అక్కడే వదిలిపెట్టి నిందితుడు పారిపోయాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న బాలుడు కోసం గాలిస్తున్నారు. నిందితుడైన బాలుడు కూడా బాధిత బాలిక సహచరుడే కావడం గమనార్హం. నిందితుడు కూడా బాధిత బాలిక చదివే పాఠశాలలో 12వ తరగతి చదువుతున్నట్టు పోలీసులు వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం బస్సు డ్రైవర్లు కాదు... తాగుబోతులు : మద్యం మత్తులో ప్రైవేట్ బస్సు డ్రైవర్లు