Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హౌస్‌మేట్స్ అంతా కుక్కలు.. నోరు పారేసుకున్న కౌశల్, బయట కౌశల్ ఆర్మీ

గీత, ఇతర హౌస్‌మేట్స్ మధ్య జరిగిన చర్చ ప్రకారం.. కుటుంబ సభ్యుల పుట్టిన రోజుకి బిగ్‌బాస్ ఏదో ఒక గిఫ్ట్ ఇస్తున్నారని, కానీ తన కూతురు పుట్టిన రోజున కోరినా కూడా ఏమీ పంపలేదని గీతతో అన్నాడు. తన కూతురు లల్లిని ఒకసారి ఇంట్లోకి పంపిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్

Advertiesment
Big Boss Telugu 2 Review
, గురువారం, 20 సెప్టెంబరు 2018 (11:28 IST)
గీత, ఇతర హౌస్‌మేట్స్ మధ్య జరిగిన చర్చ ప్రకారం.. కుటుంబ సభ్యుల పుట్టిన రోజుకి బిగ్‌బాస్ ఏదో ఒక గిఫ్ట్ ఇస్తున్నారని, కానీ తన కూతురు పుట్టిన రోజున కోరినా కూడా ఏమీ పంపలేదని గీతతో అన్నాడు. తన కూతురు లల్లిని ఒకసారి ఇంట్లోకి పంపిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. ఇందుకు గీత మీ అమ్మాయి వస్తే మీకు ‘బూస్టింగ్’లా ఉంటుందని పంపించలేదేమో అని చెప్పగా, చిన్నపిల్ల మీద పడి ఎందుకు ఏడుస్తున్నారని వ్యాఖ్యానించి గొడవ పెట్టుకోవడం మొదలుపెట్టారు. అదే పెద్ద తుఫానుగా మారి హౌస్‌లో వాడివేడి వాతావరణం నెలకొంది. 
ఫోటో క్రెడిట్-ట్విట్టర్
 
‘‘నేనేదైనా మాట్లాడితే చాలు హౌస్‌మేట్స్ అంతా కుక్కల్లా మీద పడిపోతారు’’ అంటూ కౌశల్ నోరు పారేసుకోవడంతో మర్యాద మరచి అందరినీ ఆ మాట అనేసరికి హౌస్‌మేట్స్ షాకయ్యారు. సామ్రాట్.. కౌశల్ మీదకు వస్తూ.. ‘‘ఏమంటున్నావ్ రా కౌశల్.. మైండ్ యువర్ లాంగ్వేజ్’’ అంటూ వార్నింగ్ ఇచ్చాడు. తనీష్ ఎప్పట్లాగే కోపంతో ఊగిపోయాడు. 
 
కుటుంబాన్ని వదిలి ఇన్నాళ్లుగా ఇక్కడ ఉంటుంటే కుక్కులంటావా అంటూ రోల్ వ్యాఖ్యానించాడు. ఈ డ్రామా అలాగే చాలాసేపు కొనసాగింది. చివరిగా కౌశల్.. కుక్కలు అని ఉదాహరణగా చెప్పానే కానీ మిమ్మల్ని కుక్కలు అనలేదంటూ క్షమాపణలు చెప్పాడు. కౌశల్ మనల్ని కావాలనే తక్కువ చేసి మాట్లాడి గొడవ పడుతున్నాడని, ఎవరు అతిగా స్పందించపోవడం మంచిదని గీత చెప్పడంతో అంతా సద్దుమణిగారు.
 
"మీ ఇసుక జాగ్రత్త" టాస్క్ నిన్న కూడా కొనసాగింది. ఈసారి సామ్రాట్, దీప్తీ, తనీష్‌లు ఇసుకను కాపాడుకోవాలి. అలాగే గీత, రోల్, కౌశల్‌లు ఆ ఇసుకను పడేయాలి. మంగళవారం జరిగిన గొడవతో అలెర్ట్ అయిన బిగ్ బాస్ గట్టిగా హెచ్చరికలు జారీ చేయడంతో కొంత సజావుగానే సాగిందని చెప్పుకోవాలి. కౌశల్ తనీష్ ఇసుకను ఖాళీ చేయడానికి ప్రయత్నించారు. 
 
రోల్, దీప్తీ ఇసుకను చాలావరకు తొలగించాడు. ఇక దీప్తి సామ్రాట్‌ను గెలిపించడం కోసం ఇసుకను తొలగించలేదు. దీంతో కౌశల్ తనీష్, సామ్రాట్‌ల ఇసుకను తొలగించేందుకు ఎంతగానో ప్రయత్నించారు. చివరికి సామ్రాట్ ఇసుక ఎక్కువగా మిగలడంతో విజేతగా ప్రకటించాడు బిగ్‌బాస్. ఇక తదుపరిగా రోల్ మరియు సామ్రాట్ మధ్య మళ్లీ పోటీ జరగనుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిగ్ బాస్ 2 ఫైన‌ల్‌కి గెస్ట్‌గా వ‌చ్చేది ఎవ‌రు..? ఏమో ఏదైనా జరగొచ్చు...