Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కూల్‌లో పరిచయమైన వ్యక్తితో ఎంగేజ్‌మెంట్ : 'మిర్చి' పిల్ల వెల్లడి

Webdunia
బుధవారం, 16 జనవరి 2019 (13:40 IST)
'లీడర్' చిత్రంతో తెలుగు వెండితెరకు పరిచయమైన భామ రిచా గంగోపాధ్యాయ. రానా హీరోగా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ చిత్రం రాగా, సూపర్ డూపర్ హిట్ అయింది. తన తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న రిచా... ఆ తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన "మిర్చి", రవితేజ నటించిన "మిరపకాయ్" వంటి చిత్రాల్లో నటించింది. 
 
పైగా, కెరీర్‌లో మంచి ఫామ్‌లో ఉండగానే ఆమె ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లింది. అక్కడ బిజినెస్‌ స్కూల్‌లో జోయ్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. గత రెండేళ్లుగా కొనసాగిన వీరి ప్రేమ పెళ్లికి దారితీసింది. దీంతో ఇటీవలే నిశ్చితార్థం జరిగినట్టు రిచా వెల్లడించింది. అయితే, పెళ్లి తేదీలను మాత్రం ఇంకా ఖరారు చేయలేదని తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. కాగా, 
 
ప్రస్తుతానికి పెళ్లికి ముహూర్తం నిర్ణయించలేదని, జీవితంలో కొత్త మార్పుకోసం ఆనందంగా ఎదురుచూస్తున్నట్టుగా రిచా తెలిపారు. తెలుగుతో పాటు తమిళ, బెంగాళీ చిత్రాల్లోనూ నటించిన రిచా గంగోపాధ్యాయ సైమా వేడుకల్లో ఉత్తమ నటి (క్రిటిక్స్‌ ఛాయిస్‌) అవార్డును అందుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: కల్లుగీత కాంపౌండ్ వద్ద ఆరేళ్ల బాలిక కిడ్నాప్.. సీసీటీవీ కెమెరాలో..?

ప్రేమ వ్యవహారంలో యువతి హత్య - పక్కనే కొన ఊపిరితో ప్రియుడి...

Breaking News: హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టులో బాంబు బెదిరింపు

లింగ నిర్ధారణ పరీక్షలు.. ఆడపిల్ల అని తెలిస్తే చాలు.. అబార్షన్... వైద్యుడి నిర్వాకం

Ys Jagan: ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద జగన్, విజయమ్మ నివాళులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments