Webdunia - Bharat's app for daily news and videos

Install App

అకీరా నందన్ సినిమా ఎంట్రీపై నిర్ణయం వాడిదే : రేణూ దేశాయ్

ఠాగూర్
ఆదివారం, 5 జనవరి 2025 (17:14 IST)
తన కుమారుడు అకీరా నందన్ సినిమా ఎంట్రీపై ఆయన తల్లి, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ స్పందించారు. రాజమండ్రిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన కుమారుడు అకీరా సినిమా ఎంట్రీపై స్పందిస్తూ, తన కుమారుడు సినిమా ఎంట్రీ కోసం తాను కూడా అమితాసక్తితో ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. 
 
'నేను ఎక్కడికి వెళ్లినా నాకు ఎదురయ్యే ప్రశ్న అకీరా ఎంట్రీ గురించే. అందరి కంటే ఎక్కువగా ఒక తల్లిగా నేను ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. కాకపోతే అది పూర్తిగా అతడి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. తను ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు వస్తాడు' అని తెలిపారు.
 
అలాగే, 'నేను ఎన్నిసార్లు సెకండ్‌ ఇన్నింగ్స్‌ ఇవ్వాలి (నవ్వులు). ఇప్పటికే నాలుగైదుసార్లు సెకండ్‌ ఇన్నింగ్స్‌ అయిపోయింది. సినిమాల నుంచి చాలాకాలం బ్రేక్‌ తీసుకున్న తర్వాత 2017లో టీవీలో ఒక డ్యాన్స్‌ షోకు న్యాయ నిర్ణేతగా చేశా. ఆ తర్వాత టీవీ ఇండస్ట్రీలోనే కొన్ని వర్క్స్‌ చేశా. రెండేళ్ల క్రితం రవితేజతో ఒక సినిమా చేశా. మధ్యలో డైరెక్షన్‌ చేశా. ప్రస్తుతం నా చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. కాబట్టి నా వర్క్‌ అలా కొనసాగుతూనే ఉంది' అని ఆమె చెప్పారు. 
 
రాజమహేంద్రవరం గురించి మాట్లాడుతూ.. 'గోదావరి జిల్లాల్లో ఉన్నంత అద్భుతమైన లొకేషన్లు నేను ఎక్కడా చూడలేదు. విజయవాడ - రాజమహేంద్రవరం మధ్య పచ్చని పొలాలు చూసి నా మనసు ఆనందంతో నిండిపోయింది. ఇదొక స్వర్గం. ఈ ప్రాంతంలో ఉండటం ఒక వరం' అని అన్నారు. సినిమా షూటింగ్స్‌ ఈ ప్రాంతాల్లో జరగాలనే ప్రభుత్వ పెద్దల నిర్ణయానికి ఆమె మద్దతు తెలిపారు. 
 
దాదాపు 22 ఏళ్ల తర్వాత ఒక యాడ్‌ కోసం వర్క్‌ చేశానని అన్నారు. అందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. యాడ్స్‌లో భాగం కావడాన్ని తాను ఎంతగానో ఇష్టపడుతుంటానని చెప్పారు. సినిమాల్లోకి రావాలని తాను ఎప్పుడూ అనుకోలేదని ఇదంతా విధి రాత అని ఆమె చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నమో మిసైల్ కొట్టే దెబ్బకు పాకిస్తాన్ వరల్డ్ మ్యాప్‌లో కనబడదు: నారా లోకేష్

పాకిస్థాన్ జిందాబాద్ అనే వారి కాళ్లు నిర్ధాక్షిణ్యంగా విరగ్గొట్టాలి : సీఎం హిమంత

నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఆ 13 ఏళ్ల విద్యార్థి: 23 ఏళ్ల లేడీ టీచర్ షాకింగ్ న్యూస్

Pawan Kalyan: రైతన్నలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.. పవన్ కల్యాణ్ (video)

Aghori లేడీ కాదు, అవాక్కయ్యారా? చంచల్ గూడ జైలుకి అఘోరి శ్రీనివాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments