ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య, సినీ నటి రేణూ దేశాయ్ పట్టలేని ఆనందంలో ఉన్నారు. దీనికంతటికీ కారణం మెగా ఫ్యామిలీ నుంచి ఆమెకు సాయం అందడమే. అదేసమయంలో తన కుమార్తె ఆద్య, కుమారుడు అకీరా నందన్‌లు మెగా ఫ్యామిలీ బాగా కలిసిపోవడం, తన బిడ్డలను కూడా మెగా ఫ్యామిలీకి చెందిన కుటుం సభ్యులంతా ఎంతో అల్లారముద్దుగా చూసుకుంటున్నారు. ఇది కూడా ఆమె ఆనందానికి మరో కారణంగా ఉంది.
మూగ జీవాల సంరక్షణ కోసం నటి రేణూ దేశాయ్ గతంలో ఒక ఎన్జీవో ప్రారంభించారు. ఈ సంస్థకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన తాజాగా సాయం చేశారు. దీంతో రేణూ దేశాయ్ ఆనందం వ్యక్తం చేస్తూ, ఎన్నో ఏళ్ల తన కల నెరవేరిందని పేర్కొంటూ శనివారం పోస్ట్ పెట్టారు.
శ్రీ ఆద్య యానిమల్ షెల్టర్ పేరుతో ఉన్న ఈ సంస్థకు ఎవరైనా విరాళాలు ఇవ్వొచ్చని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తానొక అంబులెన్స్ కొనుగోలు చేసినట్లు పోస్ట్ పెట్టారు. దీనిని కొనుగోలు చేయడంలో రామ్‌చరణ్ సతీమణి ఉపాసన తన వంతు సాయం చేశారు.
చరణ్ పెంపుడు శునకం రైమీ పేరుతో విరాళం అందించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ రేణూ దేశాయ్ తాజాగా ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ పెట్టారు. 'అంబులెన్స్ కొనుగోలుకు విరాళం అందించిన రైమీకి ధన్యవాదాలు' అని రాసుకొచ్చారు. ఉపాసన కొణిదెలను ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది. ఉపాసన మంచితనాన్ని పలువురు మెచ్చుకుంటున్నారు.