Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రామ్ చరణ్ చిత్రంలో సమంత.. జాన్వీ కపూర్ వున్నా ఓకే చేసిందట!

Advertiesment
Samantha Ruth Prabhu

సెల్వి

, గురువారం, 24 అక్టోబరు 2024 (12:19 IST)
సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కానున్న గేమ్ ఛేంజర్‌తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రామ్ చరణ్ తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే ప్రస్తుతం తన 16వ చిత్రం షూటింగ్‌కు సిద్ధమవుతున్నాడు. దీనికి తాత్కాలికంగా RC16 అని పేరు పెట్టారు. 
 
రామ్ చరణ్ దర్శకుడు బుచ్చిబాబుతో కలిసి పని చేయనున్నారు. ఉప్పెన సినిమాతో తన టాలెంట్ ఫ్రావ్ చేసుకున్న బుచ్చిబాబు ఈసారి రామ్ చరణ్‌తో మరో బ్లాక్ బస్టర్ సాధించాలని తహతహలాడుతున్నాడు. 
 
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని సమాచారం. ఈ చిత్రం స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని, రామ్ చరణ్ అథ్లెట్‌గా నటిస్తున్నారని టాక్ వస్తోంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌కి జోడీగా హీరోయిన్‌గా ఇప్పటికే కన్ఫర్మ్ అయింది. 
 
అయితే ఈ సినిమాలో సమంత రూత్ ప్రభు కూడా ఓ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని ఇటీవల వార్తలు వస్తున్నాయి. ఆమె పాత్ర కథకు కీలకం అని టాక్ వస్తోంది. 
 
స్క్రిప్ట్ విన్న వెంటనే ఆమె తన ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని టాక్. ఇంతకుముందు రంగస్థలంలో వీరి కెమిస్ట్రీని అదిరింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ఓకే అయితే మరోసారి వారి ఆన్-స్క్రీన్ జత కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
 
ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించనుండగా, సంచలన సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ భారీ అంచనాల ప్రాజెక్ట్‌లో సమంత పాత్రకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రజనీకాంత్ - లోకేశ్ చిత్రంలో బాలీవుడ్ అగ్రహీరో?