Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

Renu Desai: కాశీలో సాధువును కలిసిన రేణు దేశాయ్.. విశ్వాసం మేలు చేస్తుంది.. (video)

Renu Desai

సెల్వి

, శుక్రవారం, 3 జనవరి 2025 (18:46 IST)
Renu Desai
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ తన పర్సనల్ లైఫ్‌లోనే చాలా బిజీ అయిపోయింది. మళ్లీ ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీకి రావాలనే ఆలోచన కూడా తనకు లేదని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. కానీ అకీరా మాత్రం తన తండ్రి పవన్‌తో కలిసి ఓజీలో నటించడానికి సిద్ధమయ్యాడు. దానికి సంబంధించిన షూటింగ్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. 
 
ఇక తాజాగా ఆరేళ్ల తర్వాత విజయవాడ వచ్చింది. దానికి సంబంధించిన పోస్ట్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. విజయవాడలో ల్యాండ్ అవ్వగానే ఆ విషయాన్ని తన ఫాలోవర్స్‌తో పంచుకుంది రేణు దేశాయ్. ‘ఆరేళ్ల తర్వాత విజయవాడ వచ్చాను’ అంటూ చెప్పుకొచ్చింది. 
 
దేశంలోనే తొలి మహిళా టీచర్ అయిన సావిత్రిబాయ్ పులే జయంతి వేడుకల్లో పాల్గొనడానికి రేణు దేశాయ్ విజయవాడకు వచ్చారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే మహిళల విద్య కోసం ఎంతగానో కృషి చేశారని అన్నారు.  పిల్లలు తల్లిదండ్రుల కంటే ఉపాధ్యాయులతోనే ఎక్కువగా టైం కేటాయిస్తారు. అలాంటి వాళ్ళను సమాజానికి ఉపయోగపడే విధంగా తయారు చేయాల్సిన బాధ్యత టీచర్స్ పైనే ఉంటుంది.. అందుకే ఈ కార్యక్రమానికి వచ్చానని రేణు దేశాయ్ వెల్లడించింది. 
webdunia
Renu Desai
 
ఇకపోతే.. ఇదే కార్యక్రమంలో మరో గెస్ట్‌గా హాజరయ్యారు దిగ్గజ నటుడు బ్రహ్మానందం. ఒకే వేదికపై బ్రహ్మానందంను చూడడం సంతోషంగా ఉందంటూ రేణు దేశాయ్ హర్షం వ్యక్తం చేసింది.  ఆయనను చూస్తుంటే వణుకు వచ్చేస్తోందని చెప్పింది. అదే విషయాన్ని తెలియజేస్తూ రేణు దేశాయ్ బ్రహ్మానందంను ఓజీ (OG) అని సంబోధించింది. ఓజి అంటే ఏంటి అని ఆయన అడగ్గా, ‘ఒరిజినల్ గ్యాంగ్ స్టర్’ అంటూ నవ్వేసింది.
 
ఇదిలా ఉండగా గత రెండు మూడు రోజుల నుంచి రేణూ దేశాయ్ తన పిల్లలతో కలిసి కాశీలో పర్యటించిన సంగతి తెలిసిందే. అకీరా నందన్ అక్కడ సింపుల్‌గా ఆటోలో ప్రయాణిస్తున్న వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. తాజాగా కాశీలోని సాధువుతో రేణు దేశాయ్ మాట్లాడుతూ గడిపిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 
 
ఇంకా సాధువును కలిసిన వేళ.. కాశీ పర్యటన అనంతరం రేణు దేశాయ్ భారీ సందేశంతో కూడిన పోస్టును ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ ప్రపంచం మారుతున్న వేగంతో, సమాజంపై మన అవగాహన, క్షీణిస్తున్నట్లు తరచుగా కనిపిస్తుంది. వాస్తవికతపై మన పట్టు జారిపోతున్నట్లు అనిపిస్తుంది.
 
ఈ విషయం యొక్క ముఖ్యాంశం ఏమిటంటే మనం ఎవరో మనకు తెలియదు. ఇక్కడే ఆధ్యాత్మికత, విశ్వాసం. జీవితంలో ఉద్దేశ్యాన్ని కోల్పోవడం ప్రారంభించినప్పుడు మనల్ని వాస్తవికతకు ఆధారం చేస్తుంది. మన చుట్టూ ఉన్న ప్రతిదీ చీకటిగా మారినప్పుడు, మనం నిస్సహాయంగా భావించినప్పుడు విశ్వాసం ఒక దారి లేదా మార్గదర్శకత్వమైన కాంతిగా పనిచేస్తుంది.
 
ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం అవసరం. ఒక నైతిక ఫ్రేమ్‌వర్క్‌పై బలమైన నమ్మకాన్ని నిర్ధారించడానికి అవసరమైనదిగా భావించబడుతుంది. అత్యాశ మాత్రమే మంచిదని ఎక్కువగా విశ్వసించే ప్రపంచంలో, జీవితానికి ఒక పెద్ద ప్రయోజనం  ఆధ్యాత్మికత. ఇది గొప్ప అనుభూతిని కలిగిస్తుంది.
webdunia
Renu Desai
 
ఆధ్యాత్మికత తరచుగా విస్తృత ఐక్యతను నొక్కిచెప్పడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. మనకు తెలియని ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతాం. మనం జీవితాన్ని అర్థం చేసుకోగల ఏకైక మార్గం విశ్వాసం. 
 
విశ్వాసం, ఆశావాదం అనేవి మన చీకటి సమయాల్లో ముందుకు సాగడానికి శక్తినిచ్చే శక్తికి పర్యాయపదాలుగా భావిస్తున్నాను. నేటి బూటకపు తెలివితేటల కాలంలో కొంచెం విశ్వాసం నిజంగా సహాయం చేస్తుంది. ఊపిరి.. వీడి నమ్మండి.. అంటూ రేణు దేశాయ్ పోస్టు పెట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజయ్ సేతుపతి రిలీజ్ చేసిన యాక్షన్ మూవీ కోర టీజర్