Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ అగ్రనటుడు కుమారుడుపై రేప్ కేసు

బాలీవుడ్ అగ్రనటుడు కుమారుడుపై రేప్ కేసు నమోదైంది. ఫలితంగా అగ్ర హీరో మిథున్ చక్రవర్తి భార్య యోగితా బాలి, తనయుడు మహాక్షయ్ చిక్కుల్లో పడ్డారు. ఓ రేప్ కేసుకు సంబంధించి ఈ ఇద్దరిపై ఎఫ్‌ఐఆర్ బుక్ చేయాల్సింది

Webdunia
మంగళవారం, 3 జులై 2018 (13:45 IST)
బాలీవుడ్ అగ్రనటుడు కుమారుడుపై రేప్ కేసు నమోదైంది. ఫలితంగా అగ్ర హీరో మిథున్ చక్రవర్తి భార్య యోగితా బాలి, తనయుడు మహాక్షయ్ చిక్కుల్లో పడ్డారు. ఓ రేప్ కేసుకు సంబంధించి ఈ ఇద్దరిపై ఎఫ్‌ఐఆర్ బుక్ చేయాల్సిందిగా ఓ ఢిల్లీ కోర్టు ఆదేశించింది.
 
లైంగిక దాడితోపాటు మోసం, బలవంతంగా అబార్షన్ చేయించారన్న ఆరోపణలను మహాక్షయ్ ఎదుర్కొంటున్నాడు. హిందీ, భోజ్‌పురి సినిమాల్లో నటించిన ఓ నటి అతనిపై ఢిల్లీ కోర్టులో ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఆమె ఆరోపించింది. 
 
ఈ కేసులో మహాక్షయ్‌తోపాటు అతని తల్లి యోగితా బాలిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి తగిన ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఏక్తా గౌబా వెల్లడించారు. 
 
నాలుగేళ్లుగా తనను పెళ్లి చేసుకుంటానంటూ తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని సదరు నటి ఆరోపించింది. తాను గర్భవతిని అయిన సమయంలో మహాక్షయ్ ఏవో మందులు ఇచ్చాడని, అవి వేసుకోగానే తనకు గర్భస్రావమైందని తెలిపారు. 
 
పైగా, తన కొడుకుతో సంబంధం కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మహాక్షయ్ తల్లి తల్లి యోగితా బెదిరించిందని కూడా ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. తన ప్రాణాలకు ముప్పు ఉండటంతో తాను ముంబై నుంచి ఢిల్లీకి వచ్చానని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం