Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాజకీయాల్లోకి స్టార్ హీరో చిన్నల్లుడు.. వైజాగ్ నుంచి పోటీ...

తెలుగు సినీ ఇండస్ట్రీలోనేకాకుండా, రాజకీయాల్లోకూడా వారసులు తమ ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారు. సాధారణంగా సినీ హీరోల కుమారులు సినీ ఇండస్ట్రీలోనూ, రాజకీయ నాయకుల పిల్లలు రాజకీయాల్లో రాణించడం ఆనవాయితీ. కానీ

Advertiesment
Balakrishna
, సోమవారం, 2 జులై 2018 (15:45 IST)
తెలుగు సినీ ఇండస్ట్రీలోనేకాకుండా, రాజకీయాల్లోకూడా వారసులు తమ ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారు. సాధారణంగా సినీ హీరోల కుమారులు సినీ ఇండస్ట్రీలోనూ, రాజకీయ నాయకుల పిల్లలు రాజకీయాల్లో రాణించడం ఆనవాయితీ. కానీ ఇక్కడ ఓ స్టార్ హీరో అల్లుడు ఇపుడు రాజకీయాల్లోకి ప్రవేశించనున్నారు. ఆ అగ్రహీరో ఎవరో కాదు నందమూరి బాలకృష్ణ. ఆయన చిన్నకుమార్తె తేజస్విని భర్త భరత్ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు.
 
ఇప్పటికే, ఈయన పెద్దల్లుడు నారా లోకేశ్ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఐటీ మంత్రిగా కొనసాగుతున్నారు. ఇపుడు చిన్నల్లుడు భర్త‌ను కూడా రంగంలోకి దించి, నారా లోకేశ్‌కు చేదోడువాదోడుగా ఉంచాలని బాలకృష్ణ భావిస్తున్నట్టు సమాచారం. పైగా, ఈయన వైజాగ్ నుంచి పోటీ చేయనున్నారనే వార్త హల్‌చల్ చేస్తోంది. 
 
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాల్లో అత్యంత కీలకమైనది విశాఖపట్నం ఒకటి. ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు అనేక మంది రాజకీయ నేతలు పోటీపడుతుంటారు. వచ్చే ఎన్నికల్లో ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఇప్పటికే గీతం విద్యాసంస్థల అధినేత ఎంవీవీఎస్ మూర్తి కోరారు. తనకు కేటాయించలేని పక్షంలో తన వారసుడిగా మనవడైన భరత్‌ (బాలకృష్ణ చిన్నల్లుడు)కు సీటు ఇవ్వాలని ఇప్పటికే కోరినట్టు సమాచారం. 
 
ఆది నుంచి బయటి నుంచి వచ్చి పోటీ చేసిన వారికే పెద్దపీట వేస్తూ వచ్చిన విశాఖ వాసులు, గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థినిగా పోటీపడ్డ విజయమ్మను ఓడించి, బీజేపీకి చెందిన హరిబాబుకు మద్దతు పలికిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి తిరిగి పోటీ చేసేందుకు ఆయన ఆసక్తిని చూపడం లేదని సమాచారం. గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఈ సీటును తెలుగుదేశం పార్టీ బీజేపీకి వదిలేసిందన్న సంగతి తెలిసిందే. 
 
ఈ ప్రాంతంలో మంచి పట్టున్న నేతగా, ఓటమెరుగని నేతగా ఉన్న గంటా శ్రీనివాస్‌ను అసెంబ్లీకి బదులుగా లోక్‌సభకు పంపాలని కూడా తెలుగుదేశం పార్టీ యోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కానీ, బాలయ్య మాత్రం తన చిన్నల్లుడిని ఇక్కడ నుంచి పోటీ చేయించి, పెద్దల్లుడుకు సహాయకారిగా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

''అమ్మ''పై నమ్మకం లేదు.. మహిళల్ని ఆట బొమ్మలుగా చూస్తారా? అక్కినేని అమలతో పాటు?