వామ్మో... జంబలకిడి పంబ...
						
		
						
				
హనీమూన్ నుంచి వచ్చిన తరువాత భర్త తన భార్య పర్సులో ఓ యువకుడి ఫోటోను గమనించాడు. మెుదటిసారి దాన్ని అంతగా పట్టించుకోలేదు. నెలయినా అది అలాగే ఉండడంతో భర్తకు మానసిక వేదన మెుదలైంది. చివరికి ధైర్యం చేసి భార్యన
			
		          
	  
	
		
										
								
																	హనీమూన్ నుంచి వచ్చిన తరువాత భర్త తన భార్య పర్సులో ఓ యువకుడి ఫోటోను గమనించాడు. మెుదటిసారి దాన్ని అంతగా పట్టించుకోలేదు. నెలయినా అది అలాగే ఉండడంతో భర్తకు మానసిక వేదన మెుదలైంది. చివరికి ధైర్యం చేసి భార్యను నిలదీశాడు.
	
	 
	అతను నీ మాజీ భర్తా? నీరసంగా అడిగాడు. 
	ఆమె భర్త బుగ్గ గిల్లుతూ కాదు అంది.
	అయితే నీ మాజీ బాయ్‌ఫ్రెండా?.
 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	భర్త చెవిలో ముద్దుగా, నెమ్మదిగా కాదు అంది.
	అయితే మీ అన్నయ్యా? నాన్నా?
	చేతిని నెమ్మదిగా నిమురుతూ కాదు... కాదు అంది.
	కోపంతో మరి ఎవడువాడు? అని గద్దించాడు.
	ముసిముసిగా నవ్వుతూ... సిగ్గుపడుతూ...
	అది నేనే!! సర్జరీకి ముందు అంది.