Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ట్రెండింగ్-''సదా నన్ను'' మహానటి పాట వైరల్.. (వీడియో)

అలనాటి అందాల నటి సావిత్రి జీవిత కథతో ''మహానటి'' తెరకెక్కిన సంగతి తెలిసిందే. తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ సువర్ణాధ్యాయాన్ని లిఖించుకున్న నటి సావిత్రి జీవితంపై తెరకెక్కిన మహానటి సినిమా మే 9న ప్రేక్షక

Advertiesment
Sada Nannu Full Video Song
అలనాటి అందాల నటి సావిత్రి జీవిత కథతో ''మహానటి'' తెరకెక్కిన సంగతి తెలిసిందే. తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ సువర్ణాధ్యాయాన్ని లిఖించుకున్న నటి సావిత్రి జీవితంపై తెరకెక్కిన మహానటి సినిమా మే 9న ప్రేక్షకుల భారీ అంచనాల నడుమ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా జూన్ 27వ తేదీతో యాభై రోజులను పూర్తి చేసుకుంది.
  
 
అంతేగాకుండా తొలి తెలుగు బయోపిక్ మూవీగా ''మహానటి'' తిరుగులేని కలెక్షన్లతో ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ.70 కోట్ల గ్రాస్‌ కలెక్షన్లు రాబట్టి లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో బిగ్గెస్ట్ గ్రాసర్‌గా సరికొత్త రికార్డులు నమోదు చేసింది. తాజాగా ఈ సినిమాలోని ''సదా నన్ను'' పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యూట్యూబ్ ట్రెండింగ్‌లో తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఆ సాంగ్‌ను మీరూ ఓ లుక్కేయండి. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇటలీ పర్యాటకురాలిపై టూరిస్ట్ గైడ్ అత్యాచారం.. కారులోనే నోరు కట్టేసి?