Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విజయ్ కింద కూర్చున్నాడు.. అతని కాలిపై కీర్తి సురేష్ కాలు పెట్టింది.. (ఫోటో)

''మహానటి'' సినిమా హిట్‌తో ఖుషీఖుషీగా వున్న కీర్తి సురేష్.. కోలీవుడ్‌లో మురుగదాస్ దర్శకత్వంలో, విజయ్ హీరోగా నటించే చిత్రంలో హీరోయిన్‌ పాత్ర పోషిస్తోంది. కోలీవుడ్‌లో ఫ్యాన్స్ డోస్ ఎక్కువ. తమ అభిమాన తారల

Advertiesment
Keerthy Suresh
, శుక్రవారం, 15 జూన్ 2018 (10:48 IST)
''మహానటి'' సినిమా హిట్‌తో ఖుషీఖుషీగా వున్న కీర్తి సురేష్.. కోలీవుడ్‌లో మురుగదాస్ దర్శకత్వంలో, విజయ్ హీరోగా నటించే చిత్రంలో హీరోయిన్‌ పాత్ర పోషిస్తోంది. కోలీవుడ్‌లో ఫ్యాన్స్ డోస్ ఎక్కువ. తమ అభిమాన తారలను ఎవరైనా కించ పరిస్తే అది మామూలుగా వదిలిపెట్టరు. సీన్ మొత్తం మారిపోతుంది. తాజాగా ఎవరు ఊహించని రీతిలో ఈ మధ్య కీర్తి సురేష్‌‍పై విజయ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
అయితే కీర్తికి ఆమె ఫ్యాన్స్ మద్దతుగా నిలుస్తున్నారు. అసలు సంగతి ఏంటంటే.. ప్రస్తుతం విజయ్-కీర్తి సురేష్ ఓ సినిమాలో నటిస్తున్నారు. ఏ.ఆర్ మురగదాస్ ఆ ప్రాజెక్టు‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. అయితే సినిమా చిత్రీకరణకు సంబందించిన కొన్ని స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ స్టిల్స్‌కు సంబధించిన ఓ ఫోటోలో విజయ్ కింద కూర్చొని ఉండగా.. హీరోయిన్ కీర్తి సురేష్ సోఫా మీద కూర్చొని విజయ్ మీద కాలు పెట్టింది. దీంతో విజయ్ ఫ్యాన్స్ కీర్తిపై మండిపడుతున్నారు. విజయ్ మీద కాలు పెట్టడం ఏమిటని సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. 
 
అయితే ఈ విషయంలో కీర్తికి ఆమె ఫాలోవర్స్ మద్దతుగా నిలుస్తూ ఫొటోని తెగ షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తిదశకు చేరుకుంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ విడుదలైంది. జూన్ 22న విజయ్ పుట్టినరోజు సందర్బంగా టైటిల్ ఫస్ట్‌లుక్‌ని రిలీజ్ చేయనున్నారు. ఇక తూత్తుకూడి ఘటన కారణంగా తన పుట్టిన రోజు వేడుకలను అభిమానులు నిర్వహించవద్దని విజయ్ కోరాడు. 
 
కాగా కీర్తి సురేష్ విజయ్ కాలుపై కాలు పెట్టడంపై ఆయన ఫ్యాన్స్ ఏమాత్రం జీర్ణించుకోవట్లేదు. అయితే సినిమా సన్నివేశంలో భాగంగానే కీర్తి అలా చేసివుంటుందని.. ఆ మాత్రానికి ఆమెపై మండిపడటం సబబు కాదని కీర్తి ఫ్యాన్స్ వత్తాసు పలుకుతున్నారు. మరి ఈ వివాదంపై విజయ్ ఏమంటారో వేచి చూడాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

2017 నవంబరు 8న యూఎస్‌కెళ్లిన హీరోయిన్.. స్టార్‌నైట్ ఎగ్గొట్టి వ్యభిచారం... ఎవరామె?