Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'మహానటి' పాత్ర నుంచి బయటకు రాలేకపోతోందట కీర్తి సురేష్‌

ఒకే ఒక్క సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది కీర్తి సురేష్‌. అలనాటి నటి సావిత్రి నిజ జీవితాన్ని తెరకెక్కించిన మహానటి సినిమాతో కీర్తి సురేష్‌ పేరు మారుమ్రోగిపోయింది. ఎక్కడికి వెళ్ళినా కీర్తి సురేష్‌ అనడం కన్నా సావ

Advertiesment
'మహానటి' పాత్ర నుంచి బయటకు రాలేకపోతోందట కీర్తి సురేష్‌
, శుక్రవారం, 8 జూన్ 2018 (18:46 IST)
ఒకే ఒక్క సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది కీర్తి సురేష్‌. అలనాటి నటి సావిత్రి నిజ జీవితాన్ని తెరకెక్కించిన మహానటి సినిమాతో కీర్తి సురేష్‌ పేరు మారుమ్రోగిపోయింది. ఎక్కడికి వెళ్ళినా కీర్తి సురేష్‌ అనడం కన్నా సావిత్రి అని పిలిచేవారే ఎక్కువైపోయారని ఆమె స్వయంగా చెప్పారు కూడా. తన హావభావాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దరగ్గరయ్యారు. 
 
ఇప్పటికీ కీర్తి సురేష్‌ తన నటన గురించి తలుచుకుని తానే ఆశ్చర్యపోతుంటారట. అస్సలు సావిత్రి గెటప్ నేను వెయ్యగలనా అని మొదట్లో నాకు నేను ప్రశ్నించుకున్నా. కానీ మహానటి టీం మొత్తం నాపై నమ్మకం ఉంచారు నువ్వు చేయగలవన్న థైర్యం నాకు ఇచ్చారు. అదే నన్ను ఆ క్యారెక్టర్లో లీనమైపోవడానికి దోహదపడిందని అని చెబుతోంది కీర్తి సురేష్‌. మహానటి సినిమాలో నటిస్తున్నంత కాలం నేను ఒక కొత్త లోకంలో ఉన్నానని అనిపించింది.
 
కానీ షూటింగ్ అయిపోయిన తరువాత ఇక నీ అవసరం లేదమ్మా.. సినిమా పూర్తి దశకు చేరుకుందని చెప్పిందే నాకు ఏదో తెలియని వెలితి. ఆ గొప్ప నటిని అనుకరిస్తూ సినిమా చేయడం నిజంగా నేను జీవితంలో మర్చిపోలేను అంటోంది కీర్తి సురేష్‌. మహానటి తరువాత ఆచితూచి క్యారెక్టర్లలను చేస్తోందట. తనకు మంచి పేరు వచ్చే క్యారెక్టర్లను మాత్రమే ఎంచుకుంటోందట కీర్తి సురేష్‌. కథ నచ్చితేనే సినిమాకు ఒప్పుకుంటోందట. అయినా ఇప్పటికీ మూడు కథలు తనకు నచ్చకపోవడంతో డైరెక్టర్లతో తను ఈ సినిమా చేయనని చెప్పేసిందట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'పులస చేపలా ఎగిరెగిరి పడుతున్నావ్.. నీ అన్నయ్య వాటికి బ్రాండ్ అంబాసిడర్' .. శ్రీరెడ్డి