Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విక్రమ్, కీర్తి సురేష్ 'సామి' మోషన్ పోస్టర్ విడుదల !

విక్రమ్, కీర్తి సురేష్ జంటగా తమిళంలో తెరకెక్కుతున్న చిత్రం సామీ స్క్వేర్. ఈ చిత్రాన్ని ఔరా సినిమాస్, పుష్యమి ఫిలిం మేకర్స్ పతాకంపై కావ్య వేణుగోపాల్, బెల్లం రామకృష్ణ రెడ్డి సంయుక్తంగా తెలుగులో ‘సామి’ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకరానున్నారు. సామి

Advertiesment
Vikram
విక్రమ్, కీర్తి సురేష్ జంటగా తమిళంలో తెరకెక్కుతున్న చిత్రం సామీ స్క్వేర్. ఈ చిత్రాన్ని ఔరా సినిమాస్, పుష్యమి ఫిలిం మేకర్స్ పతాకంపై కావ్య వేణుగోపాల్, బెల్లం రామకృష్ణ రెడ్డి సంయుక్తంగా తెలుగులో ‘సామి’ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకరానున్నారు. సామి చిత్ర మోషన్ పోస్టర్‌ని సోష‌ల్ మీడియాలో రిలీజ్ చేసారు. 
 
ఈ మోషన్ పోస్టర్ చూస్తుంటే... మరొకసారి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో విక్రమ్ అదరగొట్టనున్నాడని తెలుస్తుంది. సింగం మూవీ సిరీస్‌కి దర్శకత్వం వహించిన హరి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. యాక్షన్ సినిమాలని తెరకెక్కించడంలో మంచి పట్టున్న హరి మరొకసారి అదే ఫార్ములాతో పోలీస్ స్టోరీ తెర‌కెక్కిస్తుండ‌డంతో ఈ మూవీపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. 
 
రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో తమిళ నటుడు బాబీ సింహ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. విక్ర‌మ్‌కి ఈమ‌ధ్య కాలంలో స‌రైన హిట్ రాలేదు. మ‌రి... ఈ సినిమాతో అయినా స‌క్స‌స్ ట్రాక్‌లోకి వ‌స్తాడేమో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రామ్ సినిమా ఆగిపోయింది.. కార‌ణం ఏంటో తెలుసా?