మహానటికి కాసుల వర్షం.. ప్రపంచవ్యాప్తంగా రూ.30కోట్ల కలెక్షన్లు

అలనాటి సినీతార సావిత్రి బయోపిక్ ప్రస్తుతం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తెలుగు తెరపై నిండైన చందమామగా ప్రేక్షకులను మెప్పించి.. కళ్లతోనే నవరసాలను పలికించే సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి సి

బుధవారం, 23 మే 2018 (11:49 IST)
అలనాటి సినీతార సావిత్రి బయోపిక్ ప్రస్తుతం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తెలుగు తెరపై నిండైన చందమామగా ప్రేక్షకులను మెప్పించి.. కళ్లతోనే నవరసాలను పలికించే సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి విశేష ఆదరణ లభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇంతవరకూ రూ.30 కోట్లకి పైగా వసూలు చేయడం విశేషం. 
 
అలాగే మహానటి సినిమాతో పాటు రంగస్థలం, భరత్ అనే నేను సినిమాలు విదేశాల్లో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో టాలీవుడ్ సినిమాలకు బాగా డిమాండ్ ఏర్పడుతోంది. అక్కడ హిందీ సినిమాల కంటే ఎక్కువగా తెలుగు సినిమాలనే ఆదరిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ''రంగస్థలం, భరత్ అనే నేను, మహానటి'' సినిమాలు ఓవర్‌సీస్‌లో భారీ వసూళ్లు రాబట్టాయి.
 
ఈ మూడు సినిమాలు కలిసి ఇప్పటికి 9 మిలియన్‌ డాలర్స్ వసూలు చేసినట్లు సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇక ఆస్ట్రేలియాలో ఈ సంవత్సరం అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రాల జాబితాలో ‘భరత్ అనే నేను’ రెండో స్థానంలో ఉండగా 'రంగస్థలం' మూడో స్థానంలో ఉందని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం బీమా సొమ్ము కోసమే అతిలోక సుందరిని చంపేశారా?