Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బీమా సొమ్ము కోసమే అతిలోక సుందరిని చంపేశారా?

భారతీయ చలనచిత్ర అతిలోక సుందరి శ్రీదేవి మరణం మరోమారు వార్తలకెక్కింది. ఆమె నిజంగానే ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారా? లేక పక్కా ప్లాన్ ప్రకారం బీమా సొమ్ముకోసం చంపేశారా? అన్నది చర్చనీయాంశంగా మారింది.

బీమా సొమ్ము కోసమే అతిలోక సుందరిని చంపేశారా?
, బుధవారం, 23 మే 2018 (08:50 IST)
భారతీయ చలనచిత్ర అతిలోక సుందరి శ్రీదేవి మరణం మరోమారు వార్తలకెక్కింది. ఆమె నిజంగానే ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారా? లేక పక్కా ప్లాన్ ప్రకారం బీమా సొమ్ముకోసం చంపేశారా? అన్నది చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా, శ్రీదేవిని కేవలం బీమా సొమ్ముకోసమే హత్య చేశారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పైగా, ఆమె చనిపోయింది కూడా మాఫియా కింగ్ దావూద్ ఇబ్రహీం భవనంలోనే అంటూ మాజీ పోలీస్ అధికారి వేద్‌భూషణ్ ఆరోపించారు. వీటన్నింటినీ నిశితంగా పరిశీలిస్తే శ్రీదేవి మరణం మిస్టరీ మరోమారు సంచలన వార్త కానుంది.
 
శ్రీదేవి మరణంపై సమగ్ర దర్యాప్తు కోరుతూ సునీల్‌ సింగ్‌ అనే నిర్మాత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు... శ్రీదేవి మృతిలో దర్యాప్తు అవసరం లేదని పేర్కొంటూ ఆ పిటిషన్‌ను కొట్టేసింది. కానీ ఇప్పుడు ఆ పిటిషన్‌లో అంశాలు సోషల్‌ మీడియాలో సంచలనం రేపుతూ ఆమె మరణంపై అనేక తేలని అంశాలను పైకి తెస్తున్నాయి. దీనికి తోడు ఓ మాజీ పోలీసు అధికారి వ్యక్తీకరించిన అభిప్రాయాలు చర్చనీయాంశమవుతున్నాయి. 
 
సునీల్‌ సింగ్‌ పేర్కొన్న సమాచారం ప్రకారం శ్రీదేవి పేరిట రూ.240 కోట్లకు ఓ జీవిత బీమా పాలసీని ఒమాన్‌లో తీసుకున్నారు. ఆమె దుబాయ్‌లో మరణిస్తేనే ఆ సొమ్ము వారసులకు చేరుతుంది అన్న ఓ నిబంధన అందులో ఉంది. అయితే ఒక వ్యక్తి పేరిట రూ.240 కోట్ల జీవిత బీమా ఇస్తారా? మరో సందేహం ఏంటంటే దుబాయ్‌లో చనిపోతేనే ఆ సొమ్ము ఆమె వారసులకు ఇస్తారనేది! ఇలాంటి నిబంధన సాధారణంగా ఏ జీవిత బీమా సంస్థలోనూ ఉండదని పోలీసు వర్గాలంటున్నాయి. 
 
మరోవైపు, ఫిబ్రవరి 24న శ్రీదేవి మరణం అనుమానాస్పదేమనని అనేకమంది ఇప్పటికీ నమ్ముతున్నారు. 'దుబాయ్‌ అంటే మాఫియా డాన్‌ దావూద్‌ ఇబ్రహీం అడ్డా. శ్రీదేవి మరణంలో అతని పాత్ర ఉండి ఉండొచ్చు. విదేశాల్లో ముఖ్యంగా ఒక ఇస్లామిక్‌ దేశంలో ఆయన దర్యాప్తును ప్రభావితం చేయగలడు' అని వేద్‌ భూషణ్‌ అనే రిటైర్డ్‌ ఏసీపీ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈయన ఓ ప్రైవేట్‌ దర్యాప్తు సంస్థ నడుపుతున్నారు. ప్రమాదవశాత్తూ శ్రీదేవి బాత్‌ టబ్‌లో మునిగి చనిపోయారన్న పోస్ట్‌మార్టం రిపోర్టు నమ్మశక్యం కాదని ఆయన వాదిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టాప్ స్టార్‌తో మ‌ల్టీస్టార‌ర్ ప్లాన్ చేస్తోన్న పూరి..!