Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్‌బాస్ హౌస్‌లోకి 'అర్జున్ రెడ్డి'?.. ఇక లిప్ లాక్‌ కిస్సులే కిస్సులు

టాలీవుడ్ హీరో జూ.ఎన్టీఆర్ హోస్ట్‌గా స్టార్ మా టీవీలో ప్ర‌సార‌మ‌వుతున్న బిగ్‌బాస్ షోకు అనూహ్య స్పందన వచ్చింది. ఫలితంగా గత ఐదు వారాలుగా రేటింగ్స్‌లో ఈ షో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

Webdunia
శుక్రవారం, 25 ఆగస్టు 2017 (13:23 IST)
టాలీవుడ్ హీరో జూ.ఎన్టీఆర్ హోస్ట్‌గా స్టార్ మా టీవీలో ప్ర‌సార‌మ‌వుతున్న బిగ్‌బాస్ షోకు అనూహ్య స్పందన వచ్చింది. ఫలితంగా గత ఐదు వారాలుగా రేటింగ్స్‌లో ఈ షో అగ్రస్థానంలో కొనసాగుతోంది. పైగా, సినిమా రిలీజ్ స‌మ‌యంలో త‌మ చిత్రాల‌ను ప‌బ్లిసిటీ చేసుకోవ‌డం కోసం ఈ షోలో పాల్గొన‌డానికి కొత్త సినిమాల యూనిట్లు ఉత్సాహం చూపిస్తున్నాయి. 
 
ఇప్ప‌టికే ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా రానా కూడా బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు ‘అర్జున్ రెడ్డి’ సినిమా ప్ర‌చారం కోసం ఆ చిత్ర బృందం ఈ షోలో పాల్గొనాల‌ని ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టింది. ఇందు కోసం వారు ‘బిగ్‌బాస్’ నిర్వాహ‌కుల‌ను సంప్ర‌దించి, అదే ప‌నిలో బిజీబిజీగా ఉన్న‌ట్లు స‌మాచారం.
 
మరోవైపు.. 'అర్జున్ రెడ్డి' సినిమా పోస్టర్‌పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు అభ్యంతరం వ్యక్తం చేయడం, ఆయన వ్యాఖ్యలను హీరో విజయ్ దేవరకొండ ఖండించడం, ఆ ఖండనకు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మద్దతు తెలపడం తెలిసిందే.
 
ఈ నేపథ్యంలో తనను పలకరించిన ఓ న్యూస్ ఛానెల్‌తో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, ‘లిప్ లాక్‌పై ప్రతి ఒక్కరికీ ఒక అభిప్రాయం ఉంటుంది.. వారి అభిప్రాయాలను నేను గౌరవిస్తాను. నా మటుకు నాకు దీనిని సమర్థిస్తాను. అందుకే, లిప్ లాక్ సీన్లను ఈ చిత్రంలో ఉంచాం. ఈ సీన్లపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఈ సినిమా చూస్తే ఆ సీన్స్ అవశ్యకత ఏంటో తెలుస్తుంది... ఈ సినిమా ద్వారా మద్యం తాగమని, డ్రగ్స్ తీసుకోమని మేము చెప్పటంలేదు. ఆ పాత్రధారి ఆ అలవాట్లకు ఎందుకు బానిసయ్యాడనే విషయాన్ని మాత్రమే ఈ సినిమాలో చూపించాం. పోస్టర్ల ద్వారా ఆ పాత్రదారి క్యారెక్టర్‌ను మేము తెలియజేశాం’ అని చెప్పుకొచ్చాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nara Lokesh : కేజీ టు పీజీ విద్యా వ్యవస్థలో పెను మార్పులు... డీల్ కుదిరింది

Pawan Kalyan: మమత బెనర్జీ వ్యాఖ్యలను ఖండించిన పవన్-మరణ మహా కుంభ్ అంటారా?

హైదరాబాద్ నగర శివార్లలో ఫామ్ ల్యాండ్స్ ప్లాట్స్ కొంటే అంతేసంగతులు అంటున్న హైడ్రా

మహిళల్లో క్యాన్సర్.. అందుబాటులోకి ఆరు నెలల్లో వ్యాక్సిన్-ప్రతాప్ రావ్ జాదవ్

YS Jagan : జగన్‌ కోసం కన్నీళ్లు పెట్టుకున్న బాలిక.. సెల్ఫీ తీసుకున్న వైకాపా చీఫ్(video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments