Webdunia - Bharat's app for daily news and videos

Install App

కలెక్షన్ల సునామీ... రజినీకాంత్ 'కబాలీ'ని దాటేసిన అజిత్ 'వివేకం'

తమిళ హీరో అజిత్ నటించిన 'వివేకం' (తమిళంలో వివేగం) చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలీ చిత్రం కలెక్షన్లు కూడా తెరమరుగయ్యాయి. ఈ చిత్రం గురువారం రాష్ట్ర వ్యాప్తంగా

Webdunia
శుక్రవారం, 25 ఆగస్టు 2017 (13:14 IST)
తమిళ హీరో అజిత్ నటించిన 'వివేకం' (తమిళంలో వివేగం) చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలీ చిత్రం కలెక్షన్లు కూడా తెరమరుగయ్యాయి. ఈ చిత్రం గురువారం రాష్ట్ర వ్యాప్తంగా విడుదలకాగా, ఒక్క చెన్నై మహానగరంలోనే మొద‌టి రోజు రూ.1.21 కోట్లు రాబ‌ట్టిన‌ట్లు తెలుస్తోంది.
 
'క‌బాలి' చిత్రం సృష్టించిన‌ రూ.1.12 కోట్ల మొద‌టి రోజు క‌లెక్ష‌న్ల‌ మార్కును ఈ చిత్రం దాటేసింది. ఇందులో కాజల్‌, వివేక్‌ ఓబెరాయ్‌, అక్షర హాసన్‌లు కీల‌క పాత్ర‌లు పోషించారు. దీనికి శివ దర్శకత్వం వహించగా అనిరుధ్ స్వ‌రాలు అందించారు. మొద‌టి రోజే మంచి టాక్‌తో చెన్నై సిటీ బాక్సాఫీసు వద్ద వసూళ్ల వ‌ర్షం కురిపించింది. ఇదిలావుంటే గ‌తంలో విజయ్ న‌టించిన‌ ‘తెరి’ చిత్రం రూ.1.05 కోట్లు రాబ‌ట్టింది. అలాగే అమెరికాలో కూడా ‘వివేకం’ సినిమా భారీ వ‌సూళ్లు రాబ‌డుతోంది. అక్క‌డ మొద‌టి రోజు రూ. 1.37 కోట్లు రాబట్టిన‌ట్లు స‌మాచారం. 
 
మరోవైపు... ఈ చిత్రం అజిత్ అభిమానులకు ఒక రేంజ్‌లో నచ్చేసిందట. ఈ సినిమా హిట్ కావాలని కాజల్ ఎంతగానో కోరుకుంది. అలాగే ఆమెకి అక్కడ ఈ సినిమా హిట్ తెచ్చి పెట్టేసిందని అంటున్నారు. తెలుగులోనూ ఈ చిత్రం విడుదలైంది. ఈ సినిమా ఇక్కడ హిట్ అయితే కాజల్ ఈ ఏడాది హ్యాట్రిక్ హిట్ కొట్టినట్టు అవుతుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ సమీపంలో అశోక్ లేలాండ్ బస్సు తయారీ ప్లాంట్‌ ప్రారంభం

కాశ్మీర్‌లో జష్న్-ఎ-బహార్ సీజన్, తులిప్ గార్డెన్‌లో లక్షల తులిప్‌ పుష్పాలు

Smita Sabharwal: స్మితా సభర్వాల్‌కు నోటీసు జారీ.. ఆ నిధులను తిరిగి ఇవ్వాలి...

Bengaluru techie: నా భార్య వేధిస్తోంది.. ప్రైవేట్ భాగాలపై దాడి.. బెంగళూరు టెక్కీ

జనసేన పార్టీ 12వ వార్షికోత్సవ వేడుకలు.. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments