Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోయిన్ అవికా గోర్‌ను అలా తొక్కేసిన యువ హీరో.. ఎవరు?

ఇక్కడ ఎవరిని ఎవరు తొక్కేయరు.. తొక్కబడరు అని స్టేట్‌మెంట్లు ఇచ్చేస్తుంటారు సినిమా వాళ్ళు. అది విని నిజంగా నిజమేమో అని అనుకుంటుంటాం.. కానీ నిజం కాదని కొన్ని విషయాలు చెప్తుంటాయి. కాస్త పలుకుబడి మరికొంత క్రేజ్ సంపాదించే నటులను ఎలాగైనా తొక్కేయ్యాలని కొంతమ

Webdunia
సోమవారం, 28 ఆగస్టు 2017 (19:16 IST)
ఇక్కడ ఎవరిని ఎవరు తొక్కేయరు.. తొక్కబడరు అని స్టేట్‌మెంట్లు ఇచ్చేస్తుంటారు సినిమా వాళ్ళు. అది విని నిజంగా నిజమేమో అని అనుకుంటుంటాం.. కానీ నిజం కాదని కొన్ని విషయాలు చెప్తుంటాయి. కాస్త పలుకుబడి మరికొంత క్రేజ్ సంపాదించే నటులను ఎలాగైనా తొక్కేయ్యాలని కొంతమంది చూస్తుంటారు. సినీపరిశ్రమలో అదే ఇప్పుడు జరుగుతోంది.


యువ కథానాయకి అవికాగోర్ విషయంలో అదే జరుగుతోందట. ఒకటి రెండు సినిమాలతో తానేంటో నిరూపించుకుని తెలుగు సినీ పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్న అవికా గోర్ ఇప్పుడు ఇబ్బందులు  పడుతోంది. ఉయ్యాల జంపాలా.. సినిమా చూపిస్త మావతో హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చేసుకున్న అవికా గోర్ ఆ తరువాత వెనుతిరిగి చూడనేలేదు. చేతిలో ఆరు, ఏడు సినిమాలతో బిజీ అయిపోయింది.

అయితే ఆ సినిమాలు సెట్ పైకి రాకముందే అవికాగోర్‌కు కొందరు శకునిలాగా మారిపోయారట. ఆమె ఛాన్సులను లాగేసుకుంటున్నారట. ఈ హిందీ భామకు తెలుగు సినిమాల్లో అవకాశమివ్వడం ఏమిటని కొంతమంది సీనియర్ హీరోయిన్లు డైరెక్టర్లను ప్రశ్నించారట. ఇదిలావుటే అవికా ఈ మధ్య ఒక హీరోతో గొడవ పెట్టుకుందట. దీంతో ఆ యువహీరో అవికాకు తెలుగు సినిమాల్లో ఛాన్సులు రాకుండా అడ్డుపడుతున్నారట. అవికాకు ఛాన్సులు ఇవ్వకూడదంటూ మరికొంతమంది యువ హీరోలను కలుపుకుని డైరెక్టర్లతో మాట్లాడారట ఆ యువ హీరో.

విషయం కాస్త అలా అలా అవికాకు తెలిసి ఈ గోల నాకెందుకులే అని తెలుగు సినిమాల్లో నటించడం మానెయ్యడం బెటరనే నిర్ణయానికి వచ్చేసిందట. ప్రస్తుతం హిందీలో అవకాశాలు కోసం వేచి చూస్తోందట. మరి అవికాను ముప్పుతిప్పలు పెడుతున్న యువ హీరో చల్లబడితే తప్ప అవికాగోర్‌కు తెలుగులో ఛాన్సులు వచ్చే అవకాశమే లేదని చెప్పుకుంటున్నారు తెలుగు సినీజనం.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments