అలా చేసేందుకు భర్తను ఒప్పించిన ఆర్తీ అగర్వాల్ సినిమా చెల్లెలు సుదీప
సుదీప. 'నువ్వు నాకు నచ్చావ్' సినిమాలో ఆర్తీ అగర్వాల్‌కు చెల్లెలు క్యారెక్టర్ చేసింది. వెంకటేష్‌ను వెంకటేశ్వర్లు అని పింకి ఏడిపిస్తుంటే ఆర్తి అగర్వాల్ పింకి ఈజ్ జస్ట్ వెంకీ అనే డైలాగ్ అప్పట్లో బాగా పాపులరైంది. మొదటగా సుదీప చైల్డ్ ఆర్టిస్టుగా ఎం.ధర్మరా
సుదీప. 'నువ్వు నాకు నచ్చావ్' సినిమాలో ఆర్తీ అగర్వాల్‌కు చెల్లెలు క్యారెక్టర్ చేసింది. వెంకటేష్‌ను వెంకటేశ్వర్లు అని పింకి ఏడిపిస్తుంటే ఆర్తి అగర్వాల్ పింకి ఈజ్ జస్ట్ వెంకీ అనే డైలాగ్ అప్పట్లో బాగా పాపులరైంది. మొదటగా సుదీప చైల్డ్ ఆర్టిస్టుగా ఎం.ధర్మరాజు ఎం.ఎ. సినిమాలో ఎంటరైంది. మిస్టర్ ఫర్ఫెక్ట్‌లో ప్రభాస్ సిస్టర్ గాను, లెజెండ్‌లో బాలయ్య మరదలిగాను చేసింది.
అమర కావ్యం అనే తమిళ సినిమాలో నటించింది సుదీప. ఆ తరువాత శ్రీ రంగనాథ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరిద్దరికి ఒక పాప కూడా పుట్టింది. ఆ తరువాత సినిమాలకు దూరమవుతూ అడపాదడపా సీరియళ్ళలో నటించడం ప్రారంభించింది. పెళ్ళయిన తరువాత ఎవరూ సినిమాల్లో అవకాశమివ్వకపోవడంతో ఇక సీరియళ్లే మంచిదన్న నిర్ణయానికి వచ్చేసిందట.
బొమ్మరిల్లు అనే టివి సీరియల్‌లో చెల్లెలుగా నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంది. అలా ఒక్కో సీరియల్లో నటిస్తూ వస్తోంది. మళ్ళీ అవకాశమొస్తే సినిమాల్లో నటించడానికి సిద్థంగా ఉన్నానంటోందట. భర్తను కూడా ఇదే విషయంపై ఒప్పించిందట. అయితే సుదీపకు అవకాశాలివ్వడానికి ప్రస్తుతం డైరెక్టర్లు ఎవరూ ముందుకు రావడంలేదట. కారణం ఏంటో?