Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నా అదృష్టం మొత్తం నా రింగులోనే వున్నదంటున్న రకుల్ ప్రీత్ సింగ్

మన తెలుగు ఇండస్ట్రీకి వచ్చేవారు పోయేవారు చాలామందే ఉంటారు. కానీ ఇక్కడ పాతుకుపోయేవారే చాలామందే ఉన్నారు. ఆ లిస్టులో రకుల్ ప్రీత్ సింగ్, రాశీఖన్నాలు ఉన్నారు. వీరిద్దరు కలిసి హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో రకుల్ ప్రీత్ సింగ్ తన

Advertiesment
నా అదృష్టం మొత్తం నా రింగులోనే వున్నదంటున్న రకుల్ ప్రీత్ సింగ్
, గురువారం, 24 ఆగస్టు 2017 (18:49 IST)
మన తెలుగు ఇండస్ట్రీకి వచ్చేవారు పోయేవారు చాలామందే ఉంటారు. కానీ ఇక్కడ పాతుకుపోయేవారే చాలామందే ఉన్నారు. ఆ లిస్టులో రకుల్ ప్రీత్ సింగ్, రాశీఖన్నాలు ఉన్నారు. వీరిద్దరు కలిసి హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో రకుల్ ప్రీత్ సింగ్ తన చేతికి ఉంగరం ధరించిందట. కనక పుష్యరాగంలో ఉన్న ఉంగరాన్ని రకుల్ తన కుడి చేతికి ధరించిందట. ఆ రింగ్ గురించి మీడియా అడిగితే తన అదృష్టం మొత్తం ఆ రింగ్ లోనే ఉందని చెప్పిందట. 
 
నమ్మకాలు, శాస్త్రాలు చాలామంది నమ్మరు కాని సినీ పరిశ్రమలో మాత్రం కొంతమంది హీరోయిన్లు తు.చ తప్పకుండా పాటిస్తున్నారు. రాశీ ఖన్నా, రకుల్ చేతిలోని ఆ ఉంగరాన్ని మీడియాకు చూపిస్తూ తెగ నవ్వుకుందట. అయితే రకుల్ మాత్రం తన మొదటి సినిమా నుంచి ఈ ఉంగరాన్ని ధరించానని, ఇప్పటివరకు తాను నటించిన సినిమాలన్నీ తనకు గుర్తింపునిస్తున్నాయని, దానికి కారణం ఆ ఉంగరమేనని చెబుతోందట రకుల్ ప్రీత్ సింగ్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రియమణి ఇలా సింపుల్‌గా కానించేసిందేమిటి?