Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఎఫ్-3" మూవీలో మరో హీరో... క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

Webdunia
ఆదివారం, 12 ఏప్రియల్ 2020 (11:06 IST)
గత యేడాది సంక్రాంతికి విడుదలై బంపర్ హిట్ కొట్టిన చిత్రం "ఎఫ్-2" (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్). సీనియర్ నటుడు విక్టరీ వెంకటేష్, యువహీరో వరుణ్ తేజ్‌లు హీరోలుగా నటించగా, తమన్నా, మెహ్రీన్‌లు హీరోయిన్లుగా నటించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా, ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ కొట్టడంతో పాటు... నిర్మాతకు కాసుల వర్షం కురిపించింది. 
 
ఈ పరిస్థితుల్లో "ఎఫ్-3" సీక్వెల్ చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగింది. దీనిపై దర్శకుడు అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు. అలాగే, ఈ చిత్రం గురించి మరో ఆసక్తికరమైన విషయాన్ని కూడా వెల్లడించారు. ఈ చిత్రం స్క్రిప్టును సిద్ధం చేసే పనులతో బిజీగా ఉన్నట్టు చెప్పాడు. 
 
అయితే, ఈ సినిమాలో ఎంత మంది హీరోలు ఉంటారు, హీరోయిన్‌లు ఎవ‌రు. మొద‌టి పార్ట్‌లానే రెండో పార్ట్ ఉంటుందా అనే అనుమానాల‌ు చాలా మందికి ఉన్నాయి. 
 
వీటిపై కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. "ఎఫ్-3" చిత్రం వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్‌, త‌మ‌న్నా, మెహ‌రీన్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లోనే రూపొందుతుంద‌ని, ద్వితీయార్ధంలో ఏదైన ఛాన్స్ ఉంటే మ‌రో హీరో గురించి ఆలోచిస్తున్నట్టు చెప్పాడు. 
 
హౌస్‌ఫుల్, గోల్ మాల్ త‌ర‌హా ఫ్రాంచైజీని తెలుగులోకి తీసుకొస్తున్నాం. వెంకీ ఆస‌నం ఎందుకు వేశాడు. కోబ్రో అంటూ వెంకీని వరుణ్ ఎందుకు క‌లిసాడు లాంటి ఆస‌క్తిక‌ర స‌న్నివేశాల‌తో స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నామ‌ని దర్శకుడు వివరించారు. అయితే, ఈ స్క్రిప్టు ఎపుడు సెట్స్‌పైకి వెళుతుందో మాత్రం వెల్లడించలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ కేసు: జగన్‌ను అదానీ ఎప్పుడెప్పుడు కలిశారు.. అమెరికా అభియోగాల్లో ఏముంది?

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments