Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'లాక్‌డౌన్‌'పై ప్రధాని మోడీ ఇలా క్లారిటీ ఇచ్చారు ... వీడియో లీక్... వైరల్

'లాక్‌డౌన్‌'పై ప్రధాని మోడీ ఇలా క్లారిటీ ఇచ్చారు ... వీడియో లీక్... వైరల్
, గురువారం, 9 ఏప్రియల్ 2020 (11:11 IST)
ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లోవుంది. ఇది ఈ నెల 14వ తేదీతో ముగియాల్సివుంది. అయితే, దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ప్రతి రోజూ కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా, మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ కేసుల నమోదు సంఖ్య అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ పొడగించాలని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు.. వైద్య నిపుణులు కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిరోజూ నిపుణులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. 
 
ఇందులోభాగంగా, బుధవారం ఐదుగురు సభ్యుల కంటే ఎక్కువ ఉన్న రాజకీయ పార్టీలకు చెందిన లోక్‌సభ, రాజ్యసభ ఫ్లోర్ లీడర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారివారి అభిప్రాయాలను సేకరించారు. ఈ సమావేశానికి సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి లీక్ అయింది. ఇది ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ క్లిప్‌లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి సుదీప్ బంధోపాధ్యాయ పాల్గొనగా, ఓ స్క్రీన్‌పై ఆయన కనిపిస్తున్న వేళ, మరో స్క్రీన్‌పై నుంచి ప్రధాని మోడీ మాట్లాడుతున్నారు. 
 
ఇందులోని వివరాల ప్రకారం, ప్రస్తుతం ఇండియాలో సోషల్ ఎమర్జెన్సీ తరహాలో అసాధారణ స్థితి నెలకొనివుందని వ్యాఖ్యానించిన మోడీ, కరోనాను గెలవాలంటే, సామాజిక దూరం పాటించడమే ఏకైక మార్గమని చెప్పుకొచ్చారు. లాక్‌డౌన్‌ను తొలగించే విషయమై మరోమారు ఆలోచించాలని పలు రాష్ట్ర ప్రభుత్వాలు, అధికారులు కోరుతున్నారని, తాను కూడా ఒకేమారు లాక్‌డౌన్‌ను తొలగించే ఆలోచన చేయడం లేదని మోడీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 
 
కరోనా కారణంగా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పడం లేదని వ్యాఖ్యానించిన ఆయన, దేశ ప్రజల ప్రాణాలను కాపాడటమే ప్రభుత్వ కర్తవ్యమని స్పష్టంచేశారు. ఇక ఈ వీడియో వైరల్ అయిన తర్వాత, లాక్‌డౌన్ పొడిగింపు తప్పదని, ప్రజలు అందుకు మానసికంగా సిద్ధంగా ఉండాలని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 
 
ఇదిలావుండగా, ఈ వీడియోను టీఎంసీ కావాలనే లీక్ చేసిందని వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా లాక్‌డౌన్ పొడగింపు మాత్రం తథ్యమనే సంకేతాలు ఈ లీకైన వీడియో క్లిప్ ద్వారా తేలిపోయింది. సో.. మరికొన్ని రోజులు దేశ ప్రజలంతా తమతమ ఇళ్ళకే పరిమితంకాక తప్పని పరిస్థితి నెలకొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చికెన్ దుకాణం వ్యాపారికి కరోనా.. వణికిపోతున్న స్థానికులు ... ఎక్కడ?