Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బెదిరింపులకు లొంగం.. మేం చేయగలిగింది చేస్తాం : ట్రంప్‌తో మోడీ!!

బెదిరింపులకు లొంగం.. మేం చేయగలిగింది చేస్తాం : ట్రంప్‌తో మోడీ!!
, మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (17:42 IST)
కరనా వైరస్ మహమ్మారి బారినపడిన వారిని రక్షించుకునేందుకు అమెరికా కోరిన ఔషధ సాయాన్ని భారత్ పూర్తిస్థాయిలో అందించే పరిస్థితిలో లేదు. ఎందుకంటే భారత్‌లో కూడా భారీ ఎత్తున కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో భారీ ఎత్తున మందులను నిల్వచేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అగ్రరాజ్యం అమెరికా అడిగిన వెంటనే భారత్ ఔషధాలను ఎగుమతి చేయలేని పరిస్థితిలో ఉంది. 
 
దీనిపై అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ముఖ్యంగా, తమ దేశంలో కరోనా వైరస్ పెరిగిపోతున్న సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోడీకి హైడ్రాక్సీ క్లోరోక్విన్ కోసం ఫోన్‌కాల్ ద్వారా ట్రంప్ విజ్ఞప్తి చేశారు. ఆ ప్రతిపాదన ఫలించకపోవడంతో ఇండియాపై వాణిజ్య అంశాల్లో ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటున్నట్లుగా స‌మాచారం. కరోనా త‌గ్గిన‌ తర్వాత ట్రంప్... భారత్‌‌పై భారీగా వాణిజ్యం సుంకాలు వేస్తారనే అభిప్రాయమవుతోంది. 
 
ఈ నేపథ్యంలో అమెరికాకు డ్రగ్ సరఫరా కొనసాగించాలా వద్దా... అనే అంశంపై భారత్ ఇంకా ఫైనల్ నిర్ణయం తీసుకోలేదు. ట్రంప్ తనకు కాల్ చేసినప్పుడు మాత్రం మోడీ...మేం చేయగలిగింది చేస్తామ‌ని మాత్రమే చెప్పారు. 
 
అయితే, ప్రస్తుతం అమెరికాలో పెరిగిపోతున్న కరోనా వైరస్‌ని కంట్రోల్ చెయ్యలేకపోతున్న ట్రంప్... భారత్‌లాంటి దేశాల్ని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. కరోనాను సమర్థంగా కంట్రోల్ చేస్తున్న భారత్‌కి ప్రపంచ దేశాల మద్దతు లభిస్తోంది.
 
అమెరికాలో క‌రోనా విజృంభిస్తున్న త‌రుణంలో హైడ్రాక్సిక్లోరోక్వీన్ మెడిసిన్‌ను భార‌త్ త‌మ‌కు పంప‌ని ప‌క్షంలో ప్ర‌తీకారం తీర్చుకుంటామ‌ని ఆ దేశ  అధ్య‌క్షుడు ట్రంప్  ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మలేరియా నివార‌ణ‌కు ఉపయోగిస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందును ఇప్పుడు కోరనా వైరస్ నివారణకు ఉపయోగిస్తుండటంతో... ఆ మందుల ఎగుమతులపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. ఐతే... అమెరికాకు అవసరమయ్యే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌లో సగం భారత్ నుంచే ఎగుమతి అవుతున్నాయి. ఇప్పుడు భారత్ ఈ నిర్ణయం తీసుకోవడంతో... అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చాలా ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. 
 
అయితే అమెరికాకు డ్రగ్ సరఫరా కొనసాగించాలా వద్దా... అనే అంశంపై భారత్ ఇంకా ఫైనల్ నిర్ణయం తీసుకోలేదు. ట్రంప్ తనకు కాల్ చేసినప్పుడు మాత్రం మోదీ...మేం చేయగలిగింది చేస్తామ‌ని మాత్రమే చెప్పారు. ప్రస్తుతం అమెరికాలో పెరిగిపోతున్న కరోనా వైరస్‌ని కంట్రోల్ చెయ్యలేకపోతున్న ట్రంప్... భారత్ లాంటి దేశాల్ని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. కరోనాను సమర్థంగా కంట్రోల్ చేస్తున్న ఇండియాకి ప్రపంచ దేశాల మద్దతు లభిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫేక్ న్యూస్‌ను వాట్సాప్‌లో కనిపెట్టేయవచ్చు తెలుసా?