కరోనాపై తప్పుడు సమాచారం వ్యాప్తి జరుగుతున్నందున దానిని అడ్డుకోవాలని సోషల్ మీడియాలో అగ్రగామి అయిన వాట్సప్ మెసేజింగ్ యాప్‌లో కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. కరోనా వైరస్ ప్రజల్లో భయాందోళనలు రేపుతున్న నేపథ్యంలో ఏదైనా ఫేక్ న్యూస్ వైరల్‌గా మారితే పెను ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
ఇలాంటి పరిస్థితుల్లో యాండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు కలిపి కొత్త ఫీచర్ అందుబాటులోకి తేనుంది వాట్సాప్. ఈ ఫీచర్‌తో ఫేక్ న్యూస్‌ను ఇట్టే పసిగట్టేయొచ్చు. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్ బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. దీనిని WAbetainfo తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్టు చేసింది.
మెసేజ్ పక్కన సెర్చ్ ఆప్షన్‌తో ఉన్న ఫొటోను కూడా పోస్టు చేసింది. ఇంకా అధికారికంగా దీనిని విడుదల చేయలేదు. దీనిని ఎలా ఉపయోగించాలంటే.. యూజర్లు మెసేజ్ పక్కనే ఉన్న సెర్చ్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే దానిని గూగుల్‌లో సెర్చ్ చేయాలా అని అడుగుతుంది. యస్ అంటే వెబ్‌లో సెర్చ్ అవుతుంది. తద్వారా మెసేజ్ నిజమో.. ఫేకో ఇట్టే తెలుసుకోవచ్చునని ఫేస్‌బుక్ అనుబంధ సంస్థ వాట్సాప్ ఓ ప్రకటనలో వెల్లడించింది.