Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైడ్రాక్సీక్లోరోక్విన్‌తో కరోనాను జయించా.. అమెరికన్ సెన్సేషనల్ కామెంట్స్

Advertiesment
హైడ్రాక్సీక్లోరోక్విన్‌తో కరోనాను జయించా.. అమెరికన్ సెన్సేషనల్ కామెంట్స్
, మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (17:12 IST)
hydroxychloroquine
హైడ్రాక్సీక్లోరోక్విన్ తీసుకోవడం ద్వారా కరోనా తగ్గుతుందని ఏ ప్రభుత్వం వెల్లడించలేదు. అయితే హైడ్రాక్సీక్లోరోక్విన్ తీసుకోవడం ద్వారా కరోనా నుంచి కోలుకున్న ఓ అమెరికన్ పౌరుడు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడటం వల్లే తాను కరోనా బారి నుంచి బయట పడినట్టు బ్రూక్లిన్‌కు చెందిన జేమ్స్ కానిజారో (58) వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఇతని వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. 
 
దాదాపు నెల రోజుల నుంచి చికిత్స పొందుతూ వచ్చిన జేమ్స్.. ఇటీవల ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. తన డాక్టర్లు, హైడ్రాక్సీక్లోరోక్విన్ వల్లే తాను కరోనాను జయించానని జేమ్స్ నొక్కి చెప్తున్నాడు. మంచి డాక్టర్లు ఉంటే కరోనా నుంచి సులభంగా బయటపడవచ్చని, ఏ ఒక్కరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జేమ్స్ భరోసా ఇచ్చాడు. జేమ్స్ వ్యాఖ్యలతో హైడ్రాక్సీక్లోరోక్విన్ నిజంగా కరోనా నుంచి విముక్తి కలిగిస్తుందా అనే చర్చ ప్రారంభమైంది.
 
మార్చి ఏడో తేదీన తన భార్యతో కలిసి సినిమాకు వెళ్లానని.. అదే రోజు రాత్రి ఒక్కసారిగా దగ్గ, ఒళ్లు నొప్పులు మొదలైనట్టు జేమ్స్ పేర్కొన్నాడు. వెంటనే పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలినట్టు తెలిపాడు. 17 రోజుల పాటు తనను ఐసీయూలోనే ఉంచారని, తాను మరణిస్తానేమోనన్న భయం కూడా వేసిందన్నాడు. అయితే ఒకరోజు డాక్టర్లు తనకు హైడ్రాక్సీక్లోరోక్విన్ ఇచ్చారని.. కొద్ది గంటల తర్వాత ఆరోగ్యం కొంచెం కుదుటపడినట్టు అనిపించిందన్నాడు. 
 
ఇలా మూడు రోజుల పాటు హైడ్రాక్సీక్లోరోక్విన్ తీసుకోవడంతో.. తాను సాధారణ స్థితికి వచ్చేశానని జేమ్స్ తెలిపాడు. కాగా.. జేమ్స్‌కు డాక్టర్లు వరుసగా పదిరోజుల పాటు హైడ్రాక్సీక్లోరోక్విన్ ఇచ్చారు. సరిగ్గా పదకొండో రోజు జేమ్స్ పూర్తి ఆరోగ్యంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అలా చేస్తే పొదుపు..! మోదీకి దిమ్మదిరిగే సలహాలిచ్చిన సోనియా