బాహుబలిని వెనక్కి నెట్టిన మహేష్ బాబు.. సరిలేరు నీకెవ్వరు..

గురువారం, 2 ఏప్రియల్ 2020 (14:16 IST)
యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి హిట్ అందుకున్న మహేష్ బాబు, వరుసగా మూడవ విజయాన్ని అందుకుని కెరీర్ పరంగా హ్యాట్రిక్ నమోదు చేశారు.

అంతకుముందు కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన భరత్ అనే నేను, ఆపై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన మహర్షి సినిమాలతో సూపర్ హిట్స్ కొట్టిన మహేష్, సరిలేరు సక్సెస్‌తో ఫ్యాన్స్‌కు, ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. తాజాగా.. మహేష్ బాబు.. బాహుబలి రికార్డును ప్రస్తుతం మహేష్ బద్ధలు కొట్టాడు. 
 
సరిలేరు నీకెవ్వరులో మిలిటరీ ఆఫీసరుగా మహేశ్ బాబు నటించిన సంగతి తెలిసిందే. ఇందులో కామెడీ, ఎంటర్టైన్మెంట్ అదిరింది. ఇంకా యాక్షన్, ఎమోషన్ వంటి అంశాలు ఈ సినిమా సక్సెస్‌కు బాగా కలిసొచ్చాయి.

ఇకపోతే ఈ సినిమాని ఇటీవల ఉగాది పండుగ కానుకగా జెమినీ టివిలో ప్రసారం చేయగా దీనికి ఏకంగా 23.4 టీఆర్పీ రేటింగ్ వచ్చినట్లు తెలుస్తోంది. 
 
కాగా అంతకముందు అత్యధిక రేటింగ్స్ అందుకుని ముందు స్థానంలో ఉన్న సినిమాలు బాహుబలి-2.. 22.70, అలానే బాహుబలి 21.84 సినిమాలను వెనక్కు నెట్టి ఇంత భారీ స్థాయిలో రేటింగ్స్ సాధించి ముందువరుసలో సరిలేరు నీకెవ్వరు సినిమా నిలిచింది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం పృథ్వీరాజ్‌తో సహా బ్లెస్సీ యూనిట్.. ఎడారిలో చిక్కుకుపోయింది.. ఆకలితో..?