Webdunia - Bharat's app for daily news and videos

Install App

6 నుంచి "పుష్ప" కోసం శ్రీలీల - అల్లు అర్జున్ ఐటమ్ సాంగ్ చిత్రీకరణ?

ఠాగూర్
మంగళవారం, 5 నవంబరు 2024 (12:16 IST)
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన 'పుష్ప' చిత్రానికి రెండో భాగం 'పుష్ప-2' మూవీ వచ్చే నెలల 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా వి డుదలకానుంది. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని తుది దశ నిర్మాణ పనులను జరుపుకుంటుంది. అయితే, ఈ చిత్రం కోసం ఓ టైమ్ సాంగ్‌ను దర్శకుడు ప్లాన్ చేశారు. ఇందుకోసం ఐటమ్ గర్ల్‌గా టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీలను ఎంపిక చేశారు. దీంతో ఈ నెల 6వ తేదీ నుంచి అల్లు అర్జున్ - శ్రీలీలపై ఈ పాట చిత్రీకరణ ప్రారంభించనున్నట్టు సమాచారం. 
 
కాగా, ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన పాటలు, గ్లింప్స్, పోస్టర్లు సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఈ చిత్రంలోని ఐటెమ్ సాంగ్‌కు సంబంధించి ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. యంగ్ బ్యూటీ శ్రీలీల ఈ సాంగ్ చేయబోతున్నట్లు అందులో ఉంది. "టాలెంటెడ్ డ్యాన్సర్ శ్రీలీలకి స్వాగతం.. ఇద్దరు పవర్‌ఫుల్ డ్యాన్సర్లు వేదికపై నిప్పులు చెరిగేందుకు సిద్ధంగా ఉన్నారు" అంటూ ట్వీట్ చేశారు.
 
అలాగే ఈ పాట చిత్రీకరణ ఈ నెల 6వ తేదీ నుంచి మొదలుకానుందని తెలిపారు. ప్రముఖ నృత్యదర్శకుడు గణేశ్ ఆచార్య కొరియోగ్రఫీ అందించనున్నారు. దీనికి 'రేసుగుర్రం'లోని సినిమా చూపిస్తా మావ అనే పాటపై శ్రీలీలను బన్నీ ఎత్తుకుని డ్యాన్స్ చేస్తున్న వీడియోను జోడించారు.
 
అసలు తగ్గేదేలే అంటూ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. ఇది చూసిన సినిమా లవర్స్ ఇద్దరు టాలెంటెడ్ డ్యాన్సర్లను ఒకేసారి తెరపై చూస్తే థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయమని కామెంట్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాంచీలో కనిపించిన తక్షక పాము.. (వీడియో)

ఏక్‌నాథ్ షిండే కలత చెందారు... అయినా నో ఛాన్స్ : కేంద్రమంత్రి రాందాస్

భూమివైపుకు దూసుకొస్తున్న గ్రహశకలం.. ఏమైంది?

ఇస్కాన్ గురువు తరపున వాదించేందుకు ముందుకు రాని బంగ్లా లాయర్లు!!

శ్రీవారి భక్తులకు త్వరలో శుభవార్త చెప్పనున్న తితిదే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖర్జూరాలు పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు

మట్టి పాత్రలులో చేసిన వంటకాలు తింటే ఫలితాలు

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

తర్వాతి కథనం
Show comments