Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో మృతి చెందిన మిథున్ చక్రవర్తి తొలి భార్య

ఠాగూర్
మంగళవారం, 5 నవంబరు 2024 (11:41 IST)
బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి మొదటి భార్య హెలెనా ల్యూక్ అమెరికాలో చనిపోయారు. ఈ విషయాన్ని ప్రముఖ నృత్యకారిణి, నటి కల్పా అయ్యర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ నెల 3వ తేదీన ల్యూక్ తుదిశ్వాస విడిచినట్టు కల్పనా అయ్యర్ నిర్ధారించారు. అయితే, ల్యూక్ మరణానికి గల కారణాలను మాత్రం ఆమె వెల్లడించలేదు. 
 
హెలెనా ల్యూక్‌తో మిథున్ చక్రవర్తి వివాహం బంధం కేవలం నాలుగు నెలల పాటే కొనసాగింది. 1979లో వీరిద్దరు పెళ్ళి చేసుకోగా, అదే యేడాది విడిపోయారు. ఆ తర్వాత హెలెనా ల్యూక్ అమెరికాకు వెళ్లిపోయి అక్కడే విమాన రంగంలో స్థిరపడిపోయారు. 
 
హెలెనాతో విడిపోయిన తర్వాత మిథున్ చక్రవర్తి 1979లో మరో నటి యోగితా బాలిని రెండో వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం కాగా, మరొకరిని దత్తత తీసుకున్నారు. మిథున్ మొదటి భార్య హెలెనా ల్యూక్ బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్ సరసన్ "మర్డ్" చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో ఆమె బ్రిటీష్ రాణి పాత్రను పోషించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments