Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆర్తి మాటల్లో నిజం లేదు.. గాయనితో రిలేషన్‌లో లేను.. : హీరో జయం రవి

Advertiesment
arti ravi

ఠాగూర్

, శుక్రవారం, 25 అక్టోబరు 2024 (13:12 IST)
తన భార్య ఆర్తికి తెలియకుండానే విడాకులకు దరఖాస్తు చేసుకున్నట్టు వస్తున్న ఆరోపణలతో పాటు.. తాను బెంగుళూరుకు చెందిన ఓ గాయనితో రిలేషన్‌లో ఉన్నట్టు సాగుతున్న ప్రచారంపై హీరో జయం రవి స్పందించారు. ఈ ప్రచారంలో రవ్వంత నిజం కూడా లేదని చెప్పారు. 
 
తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో జయం రవి మాట్లాడుతూ, ఆర్తి మాటల్లో రవ్వంత నిజం కూడా లేదన్నారు. ఇరు కుటుంబాల పెద్దలతో చర్చించామని తెలిపారు. గాయనితో తాను రిలేషన్‌లో ఉన్నట్లు వస్తోన్న వార్తల్లో నిజం లేదన్నారు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మంచి లేదా చెడు ఏమి జరిగినా ప్రజలు గమనిస్తూ ఉండటంతో పాటు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారన్నారు. 
 
ఇలాంటి విషయాలను ఏమాత్రం నివారించలేమని తెలిపారు. కొందరు సినిమాలు, నటీనటుల వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడటానికి ఇష్టపడుతుంటారని, వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని రవి అభిప్రాయపడ్డారు. ఎలాంటి సందేహాలు, ఒత్తిళ్లు లేకుండా ఉన్నప్పుడే వృత్తికి తాను న్యాయం చేయగలనన్నారు. 
 
తన వ్యక్తిగత బాధ్యత గురించి ప్రతి ఒక్కరికి చెప్పలేనని, పరిణితి చెందిన కొంత మంది వదంతులు వ్యాప్తి చేయరని, మరి కొందరు ఆ విషయంలో ఉన్న తీవ్రత అర్థం చేసుకోకుండా వ్యాఖ్యలు చేస్తూ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తారని అన్నారు. నా గురించి నాకు తెలిసినప్పుడు ఎదుటి వారి మాటలకు ఎందుకు బాధపడాలని ప్రశ్నించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అక్టోబర్ 28న ANR అవార్డు వేడుక, చిరంజీవి, అమితాబ్ బచ్చన్ కు అందజేత