Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పుష్ప 2 కు పారితోషికం వద్దన్న అల్లు అర్జున్ - వెయ్యికోట్లు, వెయ్యి థియేటర్లు నిజమేనా?

Advertiesment
Allu Arjun- pushpa

డీవీ

, సోమవారం, 28 అక్టోబరు 2024 (09:55 IST)
Allu Arjun- pushpa
అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో విడుదలకు మముందే పుష్ప 2కు క్రేజ్ వచ్చింది. ఇది చాలా ఆశ్చర్యంగా వుంది. కొద్దిరోజుల క్రితం వరకు స్తబ్దతగా వుండి, ఒక్కసారిగా దేశమంతా అభిమానులు ఎదురుచూసేలా  సినిమాపై క్రేజ్ వచ్చింది. దానికి కారణం ఏమిటి? ట్రేడ్ వర్గాల కథనం ప్రకారం వెయ్యికోట్లు బిజినెస్ అయిందని అనధికారికంగా ప్రచారం జరిగింది. ఇంత వ్యాపారం ఏమిటి? తమిళనాడు, కర్నాటకలో కూడా అక్కడి స్టార్ హీరోలకు మించి సూపర్ హిట్ గా నిలిచిన సినిమాలను తలదన్ని పుష్ప 2 నిలిచిందని చెబుతున్నారు.
 
ఇటీవలే చిత్ర నిర్మాతలు మైత్రీమూవీస్ అధినేతలు ఈ సినిమా గురించి చెబుతూ, బ్రహ్మాండగంగా బిజినెస్ అయిందని చెప్పారు. కానీ ఈ సినిమా గురించి దర్శకుడు సుకుమార్ కానీ, హీరో అల్లు అర్జున్ కానీ ఏమీ మాట్లాడలేదు. పైగా గతంలో టైటానిక్, అవతార్ లాంటి హాలీవుడ్ సినిమాకు వున్న థియేటర్ల స్థాయికి చేరిందని చెబుతున్నారు. ఇప్పుడు వాటికి ధీటుగా పుష్ప 2 నిలవడం గొప్పగా చిత్ర టీమ్ చెబుతోంది. అదేమంటే వెయ్యికోట్ల వ్యాపారం జగడంతోపాటు వెయ్యికి పైగా థియేటర్లు రిలీజ్ కావడమే.
 
ఇక అల్లు అర్జున్ 300 కోట్ల  పారితోషికం  తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. రజనీకాంత్  జైలర్ సినిమాకు 100 కోట్లు పారితోషికం తీసుకున్నారని విన్నాం. సక్సెస్ అయ్యాక మరో వందకోట్లు, కారు గిఫ్ట్ గా  నిర్మాతలు ఇచ్చారని చూశాం. అయితే అల్లు అర్జున్ మాత్రం సినిమా రెమ్యునరేషన్ కింద కాకుండా పార్టనర్ షిప్ అడిగాడు.

అదెలా అంటే.. పుష్ప సినిమాలో గంధం చెక్కల స్మగ్గింగ్ చేసేటప్పుడు  ఎదురు పార్టీ నుంచి 5 లక్షలు ఇవ్వాల్సివస్తే నాకు డబ్బు వద్దు పార్ట్ నర్ షిప్ కావాలని అంటాడు. అదే డైలాగ్ ఈ సినిమాకు అప్లయి చేసినట్లున్నాడు. ఇంకా అల్లు అర్జున్ ప్రదర్శించిన నటనకు జాతీయ పురస్కారం అందుకున్నాడు. పుష్ప 2 సీక్వెల్ కాబట్టి మరోసారి అవార్డు దక్కించుకుంటాడా.. వేచిచూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సాయి పల్లవి కి నేను కూడా ఫ్యాన్ -అమరన్ తీయాలంటై గట్స్ కావాలి : నాగ్ అశ్విన్