సల్మాన్ సరసన నటించేందుకు ప్రియాంక వెయ్యిసార్లు ఫోన్ చేసిందట..?

''భారత్'' అనే సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా కథానాయికగా ఎంపిక చేశారు. కానీ ప్రియాంక చోప

Webdunia
ఆదివారం, 9 సెప్టెంబరు 2018 (17:14 IST)
''భారత్'' అనే సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా కథానాయికగా ఎంపిక చేశారు. కానీ ప్రియాంక చోప్రా నిక్ జోనాస్‌తో వివాహం కారణంగా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుందట. ఈ విషయాన్ని సల్మాన్ ఖాన్‌కు ప్రియాంక చోప్రా చెప్పిందట. దీంతో ఈ ప్రాజెక్టులో ప్రియాంక స్థానంలో కత్రినా కైఫ్ నటిస్తున్నారు. 
 
ఈ చిత్రానికి ప్రియాంకను కథానాయికగా తీసుకోమని డైరెక్టర్ అబ్బాస్‌కు చెప్పారట సల్మాన్. ఈ సినిమా ఛాన్స్ కోసం ప్రియాంక ఆయన చెల్లెలకు వెయ్యి సార్లు కాల్ చేశారట. గోవాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ విషయంపై కొందరు సల్మాన్‌ను ప్రశ్నించగా ఆయన సమాధానం ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడం ప్రియాంకకు ఇష్టంలేదు. ఎందుకంటే ఆమె ఈ సినిమాలో నటించడం కోసం చాలా ఆసక్తి చూపించారు. 
 
డైరెక్టర్‌కు కూడా కాల్ చేసి ఈ ప్రాజెక్ట్‌కు తనను తీసుకోవాలని కోరారు. తనతో నటించేందుకు తన చెల్లి అర్పితా ఖాన్‌కు వెయ్యిసార్లకు పైగా ఫోన్ చేశారని చెప్పారు. అయితే ప్రస్తుతం నిక్ నిశ్చితార్థం జరిగిపోవడంతో పెళ్లి, హనీమూన్ కోసం ఈ ప్రాజెక్టు నుంచి ప్రియాంక తప్పుకోవాల్సి వచ్చిందని టాక్ వస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీలో మిస్ ఫైర్లు, క్రాస్ ఫైర్లు, విడాకులు జరగవు.. నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థను దేశానికే ఆదర్శంగా అభివృద్ధి చేస్తాం.. సీఎం చంద్రబాబు

Woman: దిండుక్కల్‌‍లో ఘోరం.. బస్సు నుంచి కిందపడిన మహిళ మృతి (video)

Telugu Love: అబ్బా.. ఎంత బాగా తెలుగు మాట్లాడారు.. కృతికా శుక్లాపై పవన్ ప్రశంసలు

ఏలూరు: అర్థరాత్రి తలుపులు పగలగొట్టి యువతిపై ఇద్దరు రౌడీషీటర్లు అత్యాచారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments