ఆ టిక్కెట్ ఇవ్వకుంటే 10 నిమిషాల్లో ప్రాణం తీసుకుంటా : శ్రీకాంతాచారి తల్లి

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో హుజూర్ నగర్ స్థానం టిక్కెట్‌ను తనను కాదని మరొకరికి ఇస్తే మాత్రం జస్ట్ 10 నిమిషాల్లో ప్రాణం తీసుకుంటానని తెలంగాణ సాధన కోసం ఆత్మబలిదానానికి పాల్పడి... చరిత్రల

శనివారం, 8 సెప్టెంబరు 2018 (12:20 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో హుజూర్ నగర్ స్థానం టిక్కెట్‌ను తనను కాదని మరొకరికి ఇస్తే మాత్రం జస్ట్ 10 నిమిషాల్లో ప్రాణం తీసుకుంటానని తెలంగాణ సాధన కోసం ఆత్మబలిదానానికి పాల్పడి... చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి దాసోజు శంకరమ్మ హెచ్చరించారు. 
 
తాజాగా తెరాస తరపున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించిన విషయం తెల్సిందే. అందులో శంకరమ్మ పేరు లేదు. దీనిపై ఆమె స్పందిస్తూ, తనను కాదని టీఆర్ఎస్ పార్టీ హుజూర్ నగర్ టికెట్‌ను మరొకరికి ఇస్తే... 10 నిమిషాల్లోనే తన ప్రాణం పోతుందని ప్రకటించారు. 
 
తనకు టికెట్ ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు హామీ ఇచ్చారని... ఇచ్చిన మాటను నిలుపుకుంటారని తాను ఆశిస్తున్నానని అన్నారు. మరోవైపు శంకరమ్మకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వీరాంజనేయులు, నాగు అనే ఇద్దరు యువకులు హైదరాబాదులోని రేడియో స్టేషన్ టవర్ ఎక్కి హల్ చల్ చేసిన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం రేవ్ పార్టీ పేరుతో ఏడుగురు మహిళలతో 20 మంది పురుషులు.. ఎంజాయ్