Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముందస్తు మూడోసారి... ఎన్టీఆర్ గెలిచారు... బాబు ఓడారు... కేసీఆర్ ఏమవుతారో?

కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు సమరశంఖం పూరించడంతో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. 119 స్థానాలకు గాను 105 స్థానాలకు అభ్యర్థుల జాబితాను ప్రకటించి ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. జూన్ 2, 2014న కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమ

Advertiesment
telangana assembly dissolution
, శుక్రవారం, 7 సెప్టెంబరు 2018 (16:26 IST)
కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు సమరశంఖం పూరించడంతో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. 119 స్థానాలకు గాను 105 స్థానాలకు అభ్యర్థుల జాబితాను ప్రకటించి ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. జూన్ 2, 2014న కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వం ఏర్పటు చేసారు. ప్రభుత్వం ఏర్పడి 4 సంవత్సరాల 3 నెలల 4 రోజులు అయింది. ఇంకా 8 నెలలు సమయం ఉండగానే  ముందస్తు ఎన్నికల కోసం అసెంబ్లీ రద్దు చేశారు.
 
ముందస్తు నిర్ణయం సరైనదా కాదా అన్న విషయం అలా ఉంచితే తెలుగునాట ఇలా ముందస్తు ఎన్నికలు గత మూడు దశాబ్ధాల్లో మూడోసారి జరుగుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రెండుసార్లు 1985, 2004లో ముందస్తు ఎన్నికల జరిగాయి. 1985లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో  ఎన్.టి.ఆర్ ఘన విజయం సాధిస్తే 2004లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో చంద్రబాబు ఓటమి పాలయ్యారు. 1983లో పార్టీ స్థాపించిన ఎన్.టి.ఆర్  తొమ్మిది నెలల్లో 201 సీట్లు గెలుచుకొని ప్రభంజనం సృష్ఠించారు. 
 
అయితే నాదెండ్ల భాస్కరరావు ఎపిసోడ్ జరగడం, దేశవ్యాప్తంగా విమర్శలు రావడంతో రామారావుకు తిరిగి అధికార పగ్గాలు దక్కాయి. అనేకమంది ఎమ్మెల్యేలు పార్టీ  ఫిరాయించడం, శాసన సభ నిర్వహణ ఎన్.టి.ఆర్‌కు తలనొప్పిగా మారడంతో సభను రద్దు చేసి 1985లో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు ఎన్.టి.ఆర్. నాటి ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో 209 సీట్లు గెలుచుకుని తెలుగుదేశం తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శించింది. దేశవ్యాప్తంగా ఇంధిరాగాంధీకి వీచిన సానుకూల పవనాలు మూలంగా ఇంధిరా గాంధీ ప్రధాని పీఠం కైవసం చేసుకున్నా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఎన్.టి.ఆర్ తన హవాను కొనసాగించారు. 
 
ఇక 2004 వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్తేజంతో ఉరకలు వేసింది. అదే సమయంలో చంద్రబాబు నాయుడుపై   అలిపిరిలో బాంబు దాడి జరగడం ఆ సానుభూతి మూలంగా తిరిగి గద్దెనెక్కాలని భావించిన చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. అయితే ప్రజలు వైఎస్‌కు పట్టం కట్టారు. ఇక మూడోసారి, కొత్తగా ఏర్పడిని తెలంగాణ రాష్ట్రం 2014లో అవతరించింది. ఇంకా ఏడు నెలల వ్యవధి ఉండగానే శాసన సభను రద్దు చేసిన సీఎం కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. 
 
త్వరలో రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌.. తదితర రాష్ట్రాలతో పాటు ఎన్నికలు జరగనున్నాయి. మరి వాటితో పాటే తెలంగాణకు ఎన్నికలు నిర్వహిస్తారా లేదా అన్నది ఎన్నికల సంఘం పరిధిలోని అంశం. కేసీఆర్ మాత్రం డిసెంబర్ నెలలోనే ఎన్నికలు జరుగుతాయని తమ పార్టీ ఎమ్మెల్యేలకు చెపుతున్నారు. మరి మూడోసారి జరిగే ముందస్తు ఎన్నికలు ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే. కేసీఆర్ వ్యూహం ఫలిస్తుందో.. బెడిసికొడుతుందో కాలమే నిర్ణయిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కడుపు నొప్పి కోసం వైద్యానికి వెళితే కిడ్నీని తొలగించారు...