Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేసీఆర్‌కు తెలంగాణకు పెళ్లి చేస్తే.. శోభనం గది నుంచి బయటకు వచ్చినట్లు?

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసిన తర్వాత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయోనని స్పష్టంగా చెప్పేశారు. నవంబర్‌లో ఎన్నికలుంటాయన్నారు. నవంబర్‌లో ఎన్నికలు ఉంటాయని, డిసెంబర్‌లో ఫలి

కేసీఆర్‌కు తెలంగాణకు పెళ్లి చేస్తే.. శోభనం గది నుంచి బయటకు వచ్చినట్లు?
, శుక్రవారం, 7 సెప్టెంబరు 2018 (17:46 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసిన తర్వాత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయోనని స్పష్టంగా చెప్పేశారు. నవంబర్‌లో ఎన్నికలుంటాయన్నారు. నవంబర్‌లో ఎన్నికలు ఉంటాయని, డిసెంబర్‌లో ఫలితాలు రావొచ్చని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘంతో కూడా తాము సంప్రదింపులు చేశామన్నారు.
 
కానీ కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం ఇప్పుడే క్లారిటీ ఇవ్వలేమని చెప్తోంది. నాలుగు రాష్ట్రాలతో కలిపి ఎన్నికలు జరపాలా లేదా అనేది ఇప్పుడే చెప్పలేమని కేంద్ర ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ స్పష్టం చేశారు. రాష్ట్ర ఎన్నిక సంఘం నుంచి నివేదిక అందాక, ఎన్నికల నిర్వాహణకు సన్నద్ధంగా ఉన్నామని చెపితేనే ఎన్నికల ప్రక్రియను ప్రారంభించగలమన్నారు. 
 
ఆపద్ధర్మ ప్రభుత్వం ఆరు నెలల కంటే ఎక్కువ కాలం కొనసాగవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో కేసీఆర్ ప్రకటించడం దురదృష్టకరమన్నారు. 
 
కాగా కేసీఆర్‌‌పై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. తాజాగా సీపీఐ నేత నారాయణ సెటైర్లు విసిరారు. తెలంగాణ ప్రజలు ఆకాశమంత పందిరి వేసి తెలంగాణకు కేసీఆర్‌కు పెళ్లి చేస్తే శోభనం గది నుంచి బయటకు వచ్చినట్లుగా కేసీఆర్ వైఖరి ఉందని సీపీఐ నేత నారాయణ ఎద్దేవా చేశారు. సాఫీగా సాగుతున్న ప్రభుత్వాన్ని నడిపించలేక కేసీఆర్ చేతులెత్తేశారని.. మళ్లీ గెలిపించినా విడిచిపెడతారని విమర్శించారు. 
 
పూర్తి మెజారిటీ ఇచ్చినా పరిపాలించే బలం కేసీఆర్‌కు లేదనే విషయం తెలిసిపోయిందని.. కేసీఆర్‌వి మాటల ఆడంబరం తప్ప చేతలు కనపడటం లేదని నారాయణ వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించడం లేదనే అనుమానాలు ఉన్నాయని, ఈ విషయమై ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పురుడు పోసుకోకముందే రజినీ పార్టీ విలీనం?